YSRCP MP vulgar language  :  ఆంధ్రప్రదేశ్‌ వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు విపక్ష నేతలపై తిట్లతో విరుచుకుపడుతున్నారు. హిందూపురం ఎంపీ మరోసారి తనదైన భాషను ప్రయోగించారు.నత్తొడు ,  తిక్కలోడు , ముసలోజు అంటూ విరుచుకుపడ్డారు.  సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన వారు ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శల స్థాయి దాటి తిట్లకు వెళ్లిపోయారు.   చంద్రబాబు గాలి సోకి పైరు చెడిపోతే ఆ పైరు కు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చిన మహానుభావుడు సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. 


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే  వానదేవుడు పారిపోతాజని.., పశువులకు మేత దొరకక కబేళాకు పాతాయన్నారు.  అన్నం పెట్టే రైతన్న వలసెల్లిపాతారని అధికారంలో ఉండి రైతులకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ లీడర్ గా కూడా గెలవలేని లోకేష్ గాన్ని వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వాణ్ణి మంత్రిని చేస్తే మంగళగిరి ప్రజలు వాడ్ని వంగబెట్టి ఓడించారన్నారు.  నత్తొడు పాదయాత్ర చేసినా, తిక్కలోడు బస్ యాత్ర చేసినా ముసలోడు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్ర యాత్ర ను ఆపలేవన్నారు.


వైసీపీ వైపు సంక్షేమ పథకాలు సామాజిక న్యాయం, ప్రజలు, నీతి, నిజాయితీ ఉంటే టిడిపి వైపు ఒక తాగుబోతు లఫంగి దొంగనా కొడుకు అయ్యన్నపాత్రుడు, దేవర దున్నపోతు లాంటి అచ్చెన్నాయుడు, చింతమనేని,పట్టాభి  లాంటోల్లు ఉన్నారు. ఇలాంటి వాళ్లను వెనకేసుకొని చేసిన పాపాలను గోచీ లో పెట్టుకొని కాశీకి పోయినా ప్రజలు చంద్రబాబును నమ్మి ఓట్లు వెయ్యరన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. 


 పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఆదర్శవంతమైన సీఎం గా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబును జనం నమ్మరు అని తేల్చి చెప్పారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు పొరపాటున టిడిపి హయాంలో ఉండి ఉంటే సగం సొమ్ము పచ్చ చొక్కా నేతల జేబుల్లోకి వెల్లేదన్నారు. అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ఒక్క బటన్ నొక్కి పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్న వెనుక సీఎం జగన్ కే దక్కుతుంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద అదే బటన్ నొక్కి అఖండ విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు.