YSRCP Manifesto : మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చామని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ప్రధానమైన సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఇలా చెప్పుకూంటూ పోతే.. ఓ పెద్ద చాంతాడంత లిస్ట్ కనిపిస్దోంది. గతంలో మద్యాన్ని స్టార్ హోటళ్లకు పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని సీఎం జగన్ సహా మంత్రులు ప్రకటించారు. కానీ ఇప్పుడు మద్యనిషేధం మాటే లేదు. పైగా మద్యం ఆదాయాన్ని వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి బాండ్లు... ఇతర మార్గాల్లో అప్పులు తీసుకు వచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని బుగ్గన అసెంబ్లీలో చేతులెత్తేశారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ గురించి అసలు ఊసు లేదు. ఇలాంటి వాటిపై ప్రజల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కొత్తగా ఇచ్చే మేనిఫెస్టోపై నమ్మకం కలిగించాల్సి ఉంది.
గత మేనిఫెస్టోలో అమలు కానీ హామీలే ఎక్కువని విమర్శలు
ఎన్నికల సందర్భంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో 90 శాతం హామీలు ఇంకా నెరవేర్చలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నవరత్నాలలో హైలెట్ చేసి చెప్పి ఒక్క రత్నమైనా పూర్తిగా అమలు చేయలేదని ప్రాచరం చేస్తున్నారు. మద్యపాన నిషేధం హామీని పూర్తిగా పక్కన పెట్చేశారని.. సీపీయస్ రద్దు అమలు చేయలేని...ఉద్యోగులను కూడా మోసం చేశారని అంటున్నారు. అమరావతిని మార్చేది లేదని ప్రకటించి .. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారన ిగుర్తు చేస్తున్నారు. పోలవరం పూర్తి చేస్తామన్న మాట తప్పారని అంటున్నారు. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారని.. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్తిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నార కానీ పట్టించుకోలేదంటున్నారు. జాబ్ క్యాలెండర్, ప్రకృతి వైపరీత్యాలకి 4వెల కోట్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. ఏటా డిఎస్‌సీ మాటలేదు.. కోల్డ్ స్టోరేజ్, పంటలకు గిట్టుబాటు ధర, జర్నలిస్టులకు ఇల్లు, వృద్ధాశ్రమం, ఇస్లామిక్ బ్యాంకులు, కొత్త పరిశ్రమలు ఇవన్నీ అమలు చేయలేదని టీడీపీ అంటోంది. అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామని చెప్పినవి కూడా ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఆరు వందల వరకూ ఉంటాయని.. ఏవీ అమలు చేయలేదని అంటున్నరు.
ఈ సారి కూడా మేనిఫెస్టో కమిటీకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సారధ్యం ?
వచ్చే ఎన్నికల్లో ప్రకటించాల్సిన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. సజ్జల రామకృఅష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డిలు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కొంత ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో ఈసారి మేనిఫెస్టోను పకడ్బందీగా అమలు చేసేలా కార్యచరణ రూపొందించనున్నారు. గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈసారి కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
99 శాతం అమలు చేశామన్న ప్రచారం వల్ల మేలేనా ?
వైఎస్ఆర్‌సీపీ నేతలు తాము ఇచ్చిన హమీల్ని 99 శాతం అమలు చేశామని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే.. మాట తప్పం.. మడమ తిప్పం అనే ట్యాగ్ లైన్ తో గత ఎన్నికల్లో ప్రజల్ని గట్టిగా నమ్మించారు. అనేకవర్గాల్లో భరోసా కల్పించారు. ముఖ్యంగా ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, యువకులకు జాబ్ క్యాలెండ్ అంశాలు బాగా ఆకర్షణీయంగా మారాయి. మహిళలకు మద్య నిషేధం హామీ ఓట్ల వర్షం కురిపించిందని చెబుతారు. అయితే ప్రధానమైన హామీల విషయంలో అనుకున్న విధంగా చేయకపోవడంతో.. విపక్షాలు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీనికి కౌంటర్ ఇస్తూ. కొత్త మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన టాస్క్ ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతలపై పడింది.