చంద్రబాబు, జగన్ తన వెంట్రుక కూడా పీకలేరంటూ నంద్యాలలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రజావ్యతిరేకత కారణంగా పాలనపై పట్టు కోల్పోయి అసహనానికి గురవుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ నేత లోకేష్ భిన్నంగా స్పందించారు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. జగన్ ఆ మాట అన్న వీడియోనూ కూడా తన ట్విట్టర్‌కు జత చేశారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నామని సైటైర్ వేశారు. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని విర్శించారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం అని సలహా ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలపై లోకేష్ సెటైరిక్‌గా సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. నర్సరావుపేటలో అసూయతో టీడీపీకి గుండెపోటు వస్తుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. అసూయతో జగన్ జగన్ మళ్లీ గర్వం దాల్చారని ఈ సారి ఎవరికి గుండెపోటు వస్తుందోనని ప్రశ్నించారు.
కరెంట్ కోతలు విధిస్తున్నామని.. పవర్ హాలీడే ప్రకటిస్తున్నట్లుగా ప్రభుత్వం చేసిన ప్రకటనపైనా సెటైర్లు వేశారు లోకేష్.
ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.