AP BRS News :  బీఆర్ ఎస్ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వస్తారంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశం అవుతున్నాయి. కేసీఆర్ అంటున్నట్లుగా బీఆర్ ఎస్ లోకి వెళ్ళే జంప్ జిలానీలు ఎవనేదారి పై అంచనాలు వేసుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం భారతీయ రాష్ట్ర సమితి లోకిరావటానికి సిద్దంగా ఉన్నారని కేసీఆర్ బీఆర్ఎస్‌లో నేతల చేరిక సందర్భంగా వ్యాఖ్యానించారు. వైసీపీ,టీడీపీ పార్టిలకు  పక్కాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వర్తిస్తాయి. ఎందుకంటే ఈ రెండు పార్టిలకు చెందిన శాసన సభ్యులే ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ శాసన సభలో ఉన్నారు. జనసేన పార్టి నుండి గెలిచిన ఎకైక శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ కూడ వైసీపికి దగ్గర అవ్వటంతో,రెండు పార్టిల్లో ఉన్న శాసన సభ్యులు ఎవరూ లేరు. 


వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరు భారతీయ రాష్ట్ర సమితికి జై కొడతారు అనేది కీలకంగా మారింది.దీంతో రెండు పార్టీలకు చెందిన శాసన సభ్యులు పై అంచనాలు కూడా మెదలయ్యాయి. ఆంద్రప్రదేశ్ లో ఉన్న కీలకమయిన రాజకీయ పార్టీలను కాదని, తెలంగాణ సెంటిమెంట్ ను కేంద్రంగా చేసుకొని ఏర్పాటయిన టీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీలో చేరుతారా అన్నది ప్రధాన సందేహం.  ప్రస్తుతం భారతీయ రాష్ట్ర సమితికి  ఏపీ నుండి చేరికలు చాలా తక్కువ అనే చెప్పలి. తాజాగా  ప్రజారాజ్యం, వైసీపీ, జనసేనల్లో పోటీ చేసి ఓడిపోయిన  తోట చంద్రశేఖర్ తో పాటుగా, ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సహా  పలు పార్టీల్లో పని చేసి సైలెంట్ అయిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 


ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరిన నేతలు అంతా పొలిటికల్ గా అంత ప్రభావితం చేయగలగే నేతలు కాదని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు,తెలంగాణా రాజకీయాలకు కూడ చాలా డిఫరెన్స్ ఉంది.పైగా రెండు రాష్ట్రాల మద్య విభజన కు సంబందించిన అంశాలు ఇంకా నలుగుతూనే ఉన్నాయి. విభజన తరవాత పంపకాల్లో తెలంగాణా సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని వాదనలు పుష్కలంగా ఉన్నాయి. విభజన గాయాలు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మానలేదు. అయితే తెలంగాణాలో మాత్రం టీఆర్ఎస్ కాస్త,బీఆర్ఎస్ గా రూపుమార్చుకొని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 


ఇలాంటి కీలకమయిన అంశాలన్నీ ముడిపడి ఉన్న పరిస్దితుల్లో ,రెండు పార్టీలకు చెందిన శాసన సభ్యులు ఎవరు బీఆర్ఎస్ కు జై కొడతారనే సందేహం చాలా మందిలో వస్తోంది.  కేసీఆర్ వ్యాఖ్యలు వెనుక ఉన్న అంచనాలు,అజెండాలు ఎలా ఉంటాయన్న అంశం పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంత వరకు ఉంటుందనేని వచ్చే ఎన్నికల నాటికి క్లారిటి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.ఏపీలో ఉన్న వైసీసీ, టీడీపీ, జనసేన, బీజేపి ,వంటి పార్టిలను కాదని ఖర్చుతో కూడుకున్న పాలిటిక్స్ ను భరించేందుకు నాయకులు ఎంత వరకు బీఆర్ ఎస్ వైపు నిలబడతారనేనది కూడ ప్రశ్నగానే ఉందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడి ఉండవచ్చని అనుకుంటున్నారు.