Kavitha Assets Net Worth: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పుడు తన సొంత రాజకీయ పార్టీతో ప్రజల పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే ఆమెకు ఉన్న ఆస్తులు ఎన్ని, ఆమె ఇన్‌కమ్ సోర్స్ ఏంటనే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో గతంలో అంటే ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం కొన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రకారం ఆమెకు ఉన్న ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలు తెలుసుకుందాం. 

Continues below advertisement

కవిత ఆస్తులు గత కొన్నేళ్లుగా అనూహ్యంగా పెరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ 7. 63 కోట్లుగా ఉంది. అయితే 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఆస్తులు పెరిగినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అప్పుడు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఆస్తులు విలువ 39.79 కోట్లు దాటింది. అంటే కేవలం ఆ మూడేళ్ల వ్యవధిలోనే ఆమె ఆస్తులు దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. ఇందులో చరాస్తుల విలువ రూ. 14. 78కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ 5.70 కోట్లుగా ఉంది. 

Also Read: కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - సెంటిమెంట్లు లేని రాజకీయాలే - కేటీఆర్ తట్టుకోగలరా?

Continues below advertisement

కవిత వద్ద ఉన్న కార్ల కలెక్షన్ 

కవిత వాహనాల వినియోగంపై కూడా ప్రజల్లో ఆసక్తి ఉంది.  ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమె వద్ద టయోటా ఫార్చ్యునర్‌ కారు ఉంది. దీని విలువ సుమారు 7.58 లక్షలుగా చూపారు. ప్రస్తుతం ఆమె వద్ద ఉన్న కార్ల సమాచారం అందుబాటులో లేదు. 

అయితే ఆమె భద్రత దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన వాహనాలపై అప్పట్లో దుమారం రేగింది. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో 2016లో ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ పార్చ్యునర్ వాహనాన్ని కేటాయించారు అంతేకాకుండా బీఆర్‌ఎస్ హయాంలో కొనుగోలు చేసిన 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఈ వాహనాలు కేసీఆర్ కాన్వాయ్‌ కోసం కొనుగోలు చేశారని ప్రస్తుతం ప్రభుత్వం ఆరోపించగా, భద్రతా ప్రోటోకాల్‌లో భాగంగానే నిఘా వర్గాలు వీటిని ఏర్పాటు చేసినట్టు కవిత స్పష్టం చేశారు. 

Also Read: ఏప్రిల్ 25 సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?

కవిత పెట్టుబడులు 

కవిత కేవలం రాజకీయ నేతగానే కాకుండా తనను తాను బిజినెస్ ఉమెన్‌గా కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె పెట్టుబడులు ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల్లో ఉన్నాయి. స్ట్రక్చర్ డెవలపర్స్‌లో ఆమెకు 4.99 కోట్ల విలువైన వాటాలు ఉన్నాయి. నెట్‌పిక్సెల్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె పెట్టుబడులు పెట్టారు. రిలిక్సర్‌ ఫార్మస్యూటికల్స్‌లో ఆమె భర్త అనిల్ కుమారు ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఇందులో సుమారు 9.21 కోట్ల పెట్టుబడి ఉంది. వీటితోపాటు, భారత్ జాగృతి ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. 

కవిత స్థిరాస్తులు ఇవే 

కవిత తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని మల్లె బోయినపల్లిలో తన తండ్రి కేసీఆర్‌ బహుమతిగా ఇచ్చిన పది ఎకరాల 16 గుంటల వ్యవసాయ భూమి ఆమె పేరిట ఉంది. వీటితోపాటు నిజామాబాద్‌, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలో కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో నివాస భవనంతోపాటు సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో వాణిజ్య భవనాలు కూడా ఆమె ఆస్తుల జాబితాలో ఉన్నాయి. 

కవిత వద్ద 1.95 కిలోల బంగారం, డైమండ్‌ ఆభరణాలు ఉన్నట్టు అఫిడవిట్‌ పేర్కొంది. అలాగే 11.2 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 70.71 లక్షలుగా అప్పట్లో లెక్కించారు.

Also Watch: ట్రబుల్ లో ట్రబుల్ షూటర్..గురి పెట్టిన పేల్చిన కవిత

కవిత పేరుతో భారీగా అప్పులు 

ఆస్తులు పెరుగుదలతోపాటు ఆమె అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆమెపై మొత్తం రూ. 21. 62 కోట్ల మేర రుణం ఉంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న కార్‌ లోన్‌(10.18లక్షలు), గోల్డ్ లోన్ (24 లక్షలు) రూ. 1.16 కోట్ల మార్టిగేజ్‌లోన్‌ ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కోసం ఆమె 7 కోట్ల మేర అప్పు చేశారు. 

కవిత బయోగ్రఫీ

కవిత 1978లో కరీంనగర్‌లో జన్మించారు. జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆమె, అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ మిస్సిస్సిపీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. 2004లో భారత్‌కు తిరిగి వచ్చి ఆమె తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి మలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. కవిత ఆస్తుల లెక్కలు 2021లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు వీటిలో చాలా మార్పులు జరిగి ఉంటాయి.