Dirty Politics :  ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్స్ వ్యవహారం ఇప్పట్లో తెగేటట్టు కనబడటం లేదు. నిన్న మొన్నటి వరకు అధికార ప్రతిపక్ష నాయకులు బూతులు తిట్టుకున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఆ వ్యవహారంలో భాగం అయింది. వీడియో ఫేక్.. రిపోర్ట్ ఫేక్ అని వైఎస్ఆర్‌సీపీ నేతలు వాదిస్తున్నారు. అసలు రిపోర్టులు బయట పెట్టాలని టీడీపీ నేతలంటున్నారు. రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్లుగా అధఇకార, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్నే పట్టుకుని లాగుతూండటం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. 


మాధవ్ వివాదాస్పద వీడియో చుట్టూ ఏపీ రాజకీయాలు !
 
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వివాదాస్పద  వీడియో బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించాలన్న వాదనలు తెర పైకి వచ్చాయి.. ‌ఇక ప్రతి పక్ష టీడీపీ ఆయితే ఈ వీడియో బైటకు వచ్చిన తర్వాత అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.  ఒక్క సారిగా విమర్శలు చుట్టుముట్టడంతో వైసీపీ పార్టీ డిఫెన్స్ లో పడింది.. మహిళల రక్షణకు అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్నామంటూ సీయంతో పాటు, మంత్రులు ఆనేక సందర్బాలలో మాట్లాడారు.. మహిళా రక్షణే తమ ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం అంటు పాలన సాహిస్తున్న సందర్భంలో ఎంపీ బూతు వీడియో వ్యవహారం ఒక్కసారిగా పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.


మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించి వెనక్కి తగ్గిన వైఎస్ఆర్‌సీపీ 


వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై సీయం జగన్ చాలా‌ సీరియస్ గా ఉన్నారని ఎంపీ పై వేటు తప్పదంటూ మీడియాలో‌ కథనాలు వచ్చాయి.  అయితే ఇలాంటి వ్యవహారంలో ఆడియో ఆధారాలతో చిక్కిన అంబటి రాంబాబు, ఆవంతి శ్రీనివాస్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పడు మాధవ్ పై చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలలో తప్పుడు సంకేతాలు వెళతాయని చర్యలు తీసుకో లేదని కొందరు చెబుతున్నారు. గోరంట్ల మాధవ్ లాగా వైసీపీ  పార్టీలో మరి కొందరు ప్రముఖులు హనీ ట్రాప్ లో చిక్కారని...వారకి సంబంధించిన డర్టీ వీడియోలు ఉన్నాయని..ఎంపీ మాధవ్ పై  తీసుకుంటే‌ ఆ వీడియో లు కూడా బయటకు వస్తాయి వారిపై కూడా  చర్యలో తప్పనిసరి అవుతాయని భావిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలలో తీవ్ర‌ వ్యతిరేకత ప్రజలలో‌ వచ్చే ప్రమాదం ఉందని ఆందువల్లే చర్యలు తీసుకో లేదని చెబుతున్నారు...ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ అనూహ్యంగా   ఎదురు దాడికి దిగి ఎమి జరగ‌లేదు ప్రతి పక్షం కుట్రా అంటూ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నం ప్రారంభించారు. 


వీడియో.. టీడీపీ సర్టిఫికెట్ ఫేక్ అని చెప్పేందుకు ఎదురుదాడి !


ఈ ఎపిసోడ్ తో వైఎస్ఆర్‌సీపీ ఇబ్బంది పెట్టామని టీడీపీ అనుకుంది.  సీయం చర్యలపై వెనుకాడుతున్నట్లు తెలిసిన తర్వాత అధికార ప్రతినిధి పట్టాభి బాంబు పేల్చారు...విడియో అమెరికా లో మంచి పేరున్న సంస్థలో‌ ఎకలిప్స్  నిపుణుడు జిమ్ స్టాఫర్డ్‌ చేత  ఎనలైజ్ చేయించి  నిజాన్ని నిగ్గు తేల్చేందుకు పంపించామని తెలిపారు....విడియో మార్ఫింగ్  కాదని ఎపీ మాధవ్ దేననిన ప్రముఖ ఎనలైజిస్టి  జిమ్ స్టాఫర్డ్‌ సర్టిఫైడ్ చేసినట్లు ప్రస్మీట్ పెట్టిమరీ చెప్పారు పట్టాభి.. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎంపీ మాధవ్ పై చర్యలను.తీసుకో వాలని డిమాండ్ చేసారు ..  వివిధ రాష్ట్రాల‌ ఎంపీలు, జాతీయ మహిళా హక్కుల కమిషన్ నుంచి వత్తిడి పెరదడం దానికి తోడుగా టీడీపీ తెప్పించిన స్టాఫర్డ్‌ రిపోర్ట్  వంటివి వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారాయి. 


ఈ వివాదం ఇంకెంత కాలం? 
 
అయితే  ఆ వీడియో ఫేక్ అని ఆరోపిస్తున్న వైఎస్ఆర్‌సీపీ ...టీడీపీ తెచ్చిన సర్టిఫికెట్ కూడా ఫేక్ అని నిరూపించాలనుకున్నారు.  జిమ్ స్టాఫర్డ్‌ రిపోర్టు ఇచ్చిన మాట వాస్తవం కాదని..కావాలని ఆ పేరును వాడుకొని ఫేక్ రిపోర్ట్ జనరేట్ చేశారంటూ ప్రస్మీట్ పెట్టి మరీ తెలియ చేశారు సీఐడీ చీఫ్ సునీల్  కుమార్... గౌరవ స్థానంలో ఉన్న ఎంపీపై తప్పుడు ఆరోపణలు చేసిన  వారందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు.  వెంటనే స్పందించారు పట్టాభి...వైసీపీ ప్రభుత్వం కావాలని వ్యవస్థలను వాడుకొని తప్పుడు ఆరోపణలు చేయించిందని ద్వజ మెత్తారు...విడియోను పంపించిన టైమ్, అమెరికా లోని  విడియో ఎనలైజ్ లాబోరెటరి కి చెల్లించిన చెల్లింపు వివరాలు, బ్యాక్ ఎకౌంటు వివరాలు అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టానని చెక్ చేసుకోవాలని సవాల్‌ విసిరారు పట్టాభి... కేసులకు తాము బయపడమని స్పష్టం చేసారు. చర్యలకు సిద్దమైతే ఎదుర్కొనేందుకు తాము సిద్దమని టీడీపీ నాయకులు చెబుతున్నారు....మొత్తానికి ఎంపీ వీడియో వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో హాట్ పుట్టిస్తుంది. ఆగకుండా సాగుతోంది.