Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతృత్వంలోనే I.N.D.I.A కూటమి దారుణంగా ఓడిపోయింది. ఒక్క తెలంగాణ (Telangana Election 2023) మినహా రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), చత్తీస్‌గడ్ (Chandigarh)లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇందుకు కారణం కూటమిలో ఐక్యత లేకపోవడమేననే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే విషయంపై ఎన్నికల ఫలితాలకు ఒక నెల ముందు, బిహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) నవంబర్ 2న బహిరంగంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విశ్వసించినా, రాహుల్ గాంధీ (Rahul Gandhi) వాటిని పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందనే వాదన బలంగా ఉంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓటమి తరువాత జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ఓ నాయకుడు ఈ విషయంపై స్పందించారు. మూడు రాష్ట్రాల్లో ఓటమి గురించి చెబితే కాంగ్రెస్ అధిష్టానం నవ్వి ఊరుకుందని, ఫలితాలు వచ్చాక అసలు వాస్తవం బోధపడలేదంటూ విమర్శించారు. ఒక విధంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు I.N.D.I.A కూటమి జరిగిన గొప్పదనం మంచి ఇదేనని, ఇప్పటికైనా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
బీహార్‌లో అధికార మిత్రపక్షాలుగా ఉన్న JD(U), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షం ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ ఎన్నికలు ఒక పెద్ద అవకాశమని, అది సీట్లు పంచుకోవడానికే కాదని కూటమిలో పార్టీల ఐక్యతకు ప్రతీక అని JD(U) సీనియర్ నాయకుడు అన్నారు. మధ్యప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీకి కొన్ని సీట్లను నిరాకరించడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఎన్నికల ప్రచారానికి I.N.D.I.A కూటమి నాయకులను ఎంపిక చేసి ఉంటే ఓడిపోయి ఉండేది కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నితీష్‌ను సంప్రదించి, వారి కోసం ప్రచారానికి రప్పించి కుల సర్వే గురించి ప్రచారం చేయించి ఉంటే ఫలితం వేరేగా ఉండేది. ఇతర నాయకులు దాని గురించి మాట్లాడుతుండగానే, నితీష్ దానిని బీహార్‌లో దానిని అమలు చేసి చూపించారు’ అని JD(U) నాయకుడు అన్నారు. జూన్‌లో కూటమి ఏర్పడినప్పటి నుంచి కూటమిలోని పార్టీలు ఉదాసీనంగానే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు సీట్ల పంపకం చర్చలు ప్రారంభించే ప్రయత్నాలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తప్పించుకుందని ఆర్జేడీ నేతలు ఆరోపణ.
మూడు రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ వైఫల్యమేనని కొందరు జేడీ(యూ), ఆర్జేడీ నేతలు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది ఆ పార్టీ అభిప్రాయమని ఆరోపించారు. బీజేపీని ఢిల్లీ పీఠం నుంచి గద్దె దించడానికి పరస్పర విభేదాలు, రాష్ట్రాల మధ్య సమస్యలను పక్కనపెట్టి పోరాడాలని నితీష్ కూటమికి పలు సార్లు వివరించారు. కాంగ్రెస్, చిన్న పార్టీల మధ్య రాజకీయ విభేదాలు అనేక రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోందని, ఇది కూటమి ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని నితీష్ చెప్పారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీట్లను పంపిణీ చేయాలని కూటమికి సూచించారు.
ఇండియా కూటమి తదుపరి సమావేశానికి హాజరవుతానని బిహార్ సీఎం నితీష్ కుమార్ ధృవీకరించారు. తాను సమావేశానికి హాజరు కాలేనని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కూటమి సమావేశం ఎప్పుడు జరిగినా తాను హాజరవుతానని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి సమావేశాలకు హాజరవుతానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలను ఉటంకిస్తూ I.N.D.I.A కూటమిలో ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి ఇది సరైన సమయం అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గట్టి సవాలు విసిరే ముందు కాంగ్రెస్ I.N.D.I.A కూటమిలో భాగస్వామ్య పక్షాలతో ఉన్న విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడం నితీష్ దార్శనికతను ప్రతిబింబిస్తాయని, ఆయన ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ అత్యవసరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని JD(U) ప్రధాన కార్యదర్శి నిఖిల్ మండల్ అభిప్రాయపడ్డారు.