Munugodu TRS : మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు లేనిపోని తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. అభ్యర్థి ఎంపికలోనే అసంతృప్తి కనిపిస్తోంది. తాజాగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. వచ్చే వారం నిర్వహించబోయే బహిరంగసభలో ప్రకటించనున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకించే నేతలంతా ఏకమయ్యారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజి ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించేలేదని చెబుతున్నారు.
టిక్కెట్ ఖరారైందని భావిస్తున్న కూసుకుంట్లకు వ్యతిరేకంగా సమావేశం
కుసుకుంట్ల వ్యతిరేక వర్గం ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో రహస్యంగా సమావేశం నిర్వహించారు. కూసుకుంట్లకు టిక్కెట్ ఇస్తే టీఆర్ఎస్‌కు పని చేసేది లేదని.. ఓడించి తీరాలని వారు తీర్మానించుకున్నట్లుగా తెలు్సతోంది. మునుగోడు నియోజకవర్గం అన్ని మండలాల జెడ్పీటీసీలు,ఎంపీపీ లు ,మున్సిపల్ ఛైర్మెన్ లు,సర్పంచులు, ఎంపీటీసీలు మాజి ZPTC పలు క్రియాశీలక కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌కు చెందిన వారే. వారంతా కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఉండటంతో టీఆర్ఎస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.
వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !
సర్వేల్లో కూసుకంట్లకు సానుకూలత వచ్చిందంటున్న హైకమాండ్
టీఆర్ఎస్ అధినేత పీకే టీంతో చేయించిన సర్వేలో కూసుకుంట్లకే సానుకూలత లభించిందని పార్టీ హైకమాండ్ చెబుతోంది . ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట పార్టీ క్యాడర్‌ను హైదరాబాద్‌కు పిలిపించి మరీ మంత్రి జగదీష్ గౌడ్ చెప్పారు. కూసుకుంట్లకే టిక్కెట్ లభిస్తుందని ఆయనకు సహకరించాలని చెప్పి పంపించారు. అయితే జగదీష్ రెడ్డి తో జరిగిన సమావేశంలో పార్టీలో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కష్టపడి పని చేస్తామని చెప్పిన నేతలు.. తర్వాత మాత్రం ప్రభాకర్ రెడ్డికి ఇస్తే పని చేసేది లేదని చెబుతున్నారు. ప్రత్యేకంగా సమావేశమై మరీ ఓడగొట్టాలని తీర్మానం చేసుకున్నారు.
"అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్
కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఓటములు.. పార్టీ క్యాడర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. పార్టీ అధినేత కూసుకుంట్ల వైపే ఉన్నారు. కానీ క్యాడర్ మాత్రం సిద్ధంగా లేదు. మంత్రి సపోర్ట్ కూడా కూసుకుంట్లకే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి.. ఆర్థిక సామర్త్యం ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ అధినేత లెక్కలేస్తున్నారు. అయితే ఆయన పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో పెద్దగా టచ్‌లో ఉండకపోవడంతో సమస్యగా మారింది. ఆయన తీరును ఎక్కువ మంది స్వాగతించడం లేదు. పార్టీ ప్రజాప్రతినిధుల్ని బుజ్జగించడానికి మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి ప్రయత్నించే అవకాశం ఉంది. అందర్నీ ఏకతాటిపైకి తీసుకు వస్తే .. మునుగోడులో విజయం కేక్ వాక్ అని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. కానీ అందర్నీ సమన్వయ పరచడమే పెద్ద సవాల్‌గా మారింది.