Confusion over Bengal voter list: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న భారీ గందరగోళం రాజకీయ పార్టీలను టెన్షన్ పడుతోంది.   ఏకంగా 64 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం, మరో 60 లక్షల మందిని పరిశీలనలో ఉంచడమే దీనికి కారణం. ఎన్నికల సంఘం చేపట్టిన జాబితా సవరణ ప్రక్రియలో లక్షలాది మంది పౌరులు తమ ప్రాథమిక హక్కును కోల్పోయారు.  స్పెల్లింగ్ తప్పులు, సాంకేతిక కారణాలతో ఏకంగా 64 లక్షల మందిని ఓటుకు దూరం కావడంతో ఈ సారి ఫలితంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.    లక్షలాది ఓట్ల గల్లంతు - గెలుపోటములపై భారీ ప్రభావం   ఓటర్ల జాబితా సవరణ  రాజకీయ పార్టీల లెక్కలను తారుమారు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా  సుమారు 11  శాతం ఓటర్ల పేర్లు తొలగించడం వెనుక సాంకేతిక కారణాలు, స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం రాజకీయ సెగ పుట్టిస్తోంది. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో అత్యధికంగా పేర్లు తొలగించబడటం ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చాలా చోట్ల గత ఎన్నికల్లో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో, ఫలితం ఎటు తిరుగుతుందోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

Continues below advertisement

 సుప్రీంకోర్టు జోక్యం - రంగంలోకి 19 ప్రత్యేక ట్రిబ్యునల్లు 

ఈ భారీ గందరగోళంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కును కోల్పోయిన బాధితుల కోసం ప్రత్యేకంగా  19 అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తుల పర్యవేక్షణలో పనిచేసే ఈ ట్రిబ్యునళ్ల ద్వారా లక్షలాది అప్పీళ్లను యుద్ధప్రతిపాదికన పరిష్కరిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు అంటే, ఏప్రిల్ 21 , 27 తేదీల్లో విడుదలయ్యే అనుబంధ జాబితాల ద్వారా తమ పేరు మళ్లీ చేరుతుందని లక్షలాది మంది ఓటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ మద్దతుదారుల పేర్లు తిరిగి జాబితాలో ఉండేలా ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.

Continues below advertisement

 ప్రజాస్వామ్యానికి పరీక్ష 

బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఓటర్లు జాబితా నుంచి దూరం కావడం ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తమ ఓటు హక్కు కోసం ప్రజలు ట్రిబ్యునళ్ల ముందు బారులు తీరడం, న్యాయపోరాటం చేయాల్సి రావడం ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలోని సవాళ్లను సూచిస్తోంది. ఏప్రిల్ 23,  29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న పోలింగ్‌లో ఈ ఓట్ల గల్లంతు ఎవరికి లాభిస్తుంది? ఎవరిని దెబ్బతీస్తుంది? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గందరగోళం మధ్య ఓటింగ్ శాతం తగ్గిపోతుందా లేక పౌరులు పట్టుదలతో తమ హక్కును సాధించుకుంటారా అనేది వేచి చూడాలి.

ఓటింగ్ పై ప్రభావం చూపుతుందా? ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియపై నమ్మకం కోల్పోతే అది ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జాబితాలో పేరు లేకపోవడం కంటే ఒక పౌరుడికి పెద్ద అవమానం ఉండదు.  ప్రజాస్వామ్యంలో ఓటరే రాజు అని చెప్పే bejg, ఆ ఓటరును ట్రిబ్యునళ్ల చుట్టూ తిప్పించడం  మంచిది కాదని పార్టీలంటున్నాయి.