Andhra Pradesh Assembly Elections 2024: గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్‌ (Jagan)...టికెట్ల (Tickets)కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్‌ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతగా ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు.


నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పని తీరును సీఎం జగన్‌ పరిగణలోకి తీసుకుంటున్నారు. గడపగడపకు కార్యక్రమం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు ?  ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ ఏంటి ? అన్న దానిపై సమీక్ష చేసుకుంటున్నారు. గెలిచే వారికే టికెట్‌ అని తేల్చి పడేస్తున్నారు. నియోజకవర్గంలో అంతో ఇంతో పట్టున్న నేతలను బుజ్జగిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని, అంతా నేను చూసుకుంటానంటూ భరోసా ఇస్తున్నారు. 


మంత్రులు తానేటి వనిత(Taneti VAnitha), అమర్ నాథ్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్ రావు(Avanthi Srinivas), బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ధర్మాన క్రిష్ణదాస్(Dhrmana Krishna Das), కురసాల కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్(Ani Kumar), ఆళ్ల నాని, పాముల పుష్ఫశ్రీవాణి(Pushpa Srivani) పరిస్థితి ఏంటో ఇప్పటి దాకా తేల్చలేదు. అసలు వారికి సీటు ఉంటుందా ? ఉండదా ? ఒక వేళ సీటు ఇస్తే....సిట్టింగ్ స్థానామే ఇస్తారా లేదంటే పక్క నియోజకవర్గాలకు మార్చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అమర్నాథ్(Amarnath Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి(Anakapalli) స్థానాన్ని మరొకరికి కేటాయించారు. అమర్నాథ్ కు టికెట్ ఉంటుందా ?  లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.


మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy) పరిస్థితి కూడా గాల్లోదీపంలా మారింది. టికెట్ విషయంలో సీఎం జగన్ ఏమీ తేల్చకపోవడంతో...ఆయన హైదరాబాద్(Hyderabad) వచ్చేశారు. అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు(Kanna Babu), ఆళ్ల నాని, అనిల్ కుమార్, పాముల పుష్ప శ్రీవాణి టికెట్ల విషయం ఎటూ తేల్చడం లేదు. టికెట్ రాదని నిర్ణయానికి వచ్చిన కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పెండెం దొరబాబు(Pendem Dorababu), పర్వత ప్రసాద్, కొండేటి చిట్టిబాబు లాంటి నేతలకు టికెట్ లేదని తేల్చేశారు. దీంతో వారంతా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పెండెం దొరబాబు...అనుచరులతో సమావేశం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ వీడటం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 


నియోజకవర్గాల్లో జరుగుతున్న అసంతృప్తులు, నిరసనలు, ఆందోళనలను ముఖ్యమంత్రి జగన్‌ పట్టించుకోవడం లేదు. ఫలితాలే ప్రామాణికంగా మార్పులు చేర్పుల చేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో  గెలుపు లెక్కలు వేస్తున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా...ఎన్నికల స్కెచ్ వేస్తున్నారు జగన్‌. మొదటి రెండు జాబితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి...ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని పక్కన పెట్టేశారు సీఎం జగన్‌. మూడో జాబితాలో 21 మంది పేర్లు ప్రకటించారు. ఆరు ఎంపీ స్థానాలతో పాటు 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో పక్కన పెట్టేసిన వారికి పిలిచి టికెట్ ఇచ్చారు. కొందరి కుటుంబాలకు ఒకటికి మించి టికెట్లు కేటాయించారు. బొత్స, కారుమూరి, ఆదిమూలపు కుటుంబాలకు రెండేసి టికెట్లు కేటాయించారు. అయితే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు మాత్రం ఇప్పటి వరకు టికెట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అసలు వారి పరిస్థితి ఏంటో కూడా చెప్పలేదు. దీంతో సదరు సీనియర్ నేతల్లో వణకు మొదలైంది. 


Also Read: 'మా అబ్బాయి పెళ్లికి రండి' - చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం


Also Read: బొత్స ఫ్యామిలీకి బంపర్‌ ఆఫర్‌- ఈసారి ఎన్నికల్లో ఐదుగురికి సీట్లు