In Pics: ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం.. హాజరైన మంత్రులు
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
నోముల భగత్‌తో శాసనసభ సభ్యుడిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు నోముల భగత్‌కు అందించారు.
శాసనసభ భవనంలోని సభాపతి ఛాంబర్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ్యులు కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డా.వి నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుడ్నే అభ్యర్థిగా నిలిపింది.
ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత అయిన కె.జానా రెడ్డి పోటీ చేశారు. అయినా నోముల భగత్ గెలుపొందారు.