BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గజమాలతో ఘనస్వాగతం లభించింది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలుకు వెళ్లిన కవిత కొన్ని నెలల తరువాత జైలు నుంచి విడుదలయ్యారని తెలిసిందే. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత ఇందూరు పర్యటనకు రావడంతో బీఆర్‌ఎస్ నేతలు, జాగృతి నాయకులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
మొదట కవితకు ఇందల్వాయి టోల్ గేట్ వద్ద, అనంతరం డిచ్‌పల్లి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కవిత నేరుగా నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని ప్రసంగించనున్నారు.
ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నిజామాబాద్ పట్టణంలో ప్రధాన కూడళ్లలో పెద్దపెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. నేటి కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.