✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Minister KTR: ఉచితంగా స్కూటీల పంపిణీ.. ఇదే నాకు ఆత్మసంతృప్తి: కేటీఆర్

ABP Desam   |  09 Aug 2021 11:38 AM (IST)
1

ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రకటించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం కింద వికలాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది తన పుట్టిన రోజుకు ఫ్లె్క్సీలు, బ్యానర్ల కోసం డబ్బు వృథా చేయొద్దని కోరిన కేటీఆర్‌.. గత ఏడాది నుంచి గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

2

గతేడాది ఆయన పుట్టిన రోజుకు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 6 అంబులెన్స్‌ను దానం చేశారు. ఈ ఏడాది 130 స్కూటర్లను దివ్యాంగులకు అందించారు. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లోని జల విహార్‌లో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు.

3

మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు 150 స్కూటర్లు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు 100 స్కూటర్లు, వివేకానంద్‌ 50, ఎమ్మెల్సీలు శంబీపూర్‌ రాజు 63, నవీన్‌ 100 చొప్పున స్కూటర్లు అందించారని కేటీఆర్ వేదికపై వెల్లడించారు.

4

రాజకీయాల కోసం ప్రత్యేక రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లకు పెట్టే ఖర్చును ఇలాంటి మంచి కార్యక్రమాలకు వాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

5

రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటారని, వాటిలో భాగంగా ఒక్కోసారి అనవసర ఖర్చులైన బ్యానర్లు, హోర్డింగుల ఏర్పాటుకు కూడా ఖర్చులు పెడుతుంటారని అన్నారు. అలాంటి ఖర్చులను తగ్గించుకోవాలన్నదే తన ఆలోచన అని అన్నారు.

6

కరోనా విపత్కర పరిస్థితుల్లో డబ్బులు వృథాగా ఖర్చు పెట్టొద్దని పిలుపునిచ్చారు. ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా వెయ్యి మోటార్‌ సైకిళ్లను దివ్యాంగులకు అందజేసినట్లు తెలిపారు.

7

టీఆర్‌ఎస్‌ నేతలు సైతం సొంతగా ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల వాహనాలు బాగా ఉపయోగపడతాయని కేటీఆర్ వెల్లడించారు.

8

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పాల్గొన్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • Minister KTR: ఉచితంగా స్కూటీల పంపిణీ.. ఇదే నాకు ఆత్మసంతృప్తి: కేటీఆర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.