In Pics: ప్రైవేటు బస్సు దగ్ధం.. ఎగసిపడ్డ అగ్ని కీలలు, లోపల 26 మంది ప్రయాణికులు
ABP Desam | 18 Oct 2021 09:43 AM (IST)
1
జనగామ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు అగ్నికి ఆహుతైంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి.
2
బస్సు ఇంజన్లో పొగ రావడం గమనించి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
3
బస్సులో సుమారుగా 26 మంది ప్రయాణికులు సకాలంలో సురక్షితంగా బయటపడగలిగారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగుతుండడం వల్ల అగ్ని మాపక సిబ్బందికి ప్రయాణికులు సమాచారం ఇచ్చారు.
4
ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
5
ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా సేపు ప్రయాణికులు రోడ్డుపైనే ఉన్నారు. అనంతరం మరో బస్సును రప్పించి వారిని అందులో ఎక్కించి గమ్యస్థానానికి పంపించారు.