In Pics : భాగ్యనగరం మణిహారంలో మరో ఫ్లై ఓవర్, ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం!
హైదరాబాద్ నగరంలో మరో నూతన ఫ్లైఓవర్ ఓపెన్ ప్రారంభం అయింది. (Image Credit : KTR Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రి కేటీఆర్ శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ ను శుక్రవారం ప్రారంభించారు. (Image Credit : KTR Twitter)
ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రభుత్వం నిర్మించింది. (Image Credit : KTR Twitter)
ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన నూతన ఫ్లైఓవర్ ను ఓఆర్ఆర్‌కి అనుసంధానించారు. (Image Credit : KTR Twitter)
హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది. ఈ ఫ్లైఓవర్ పొడవు 956 మీటర్లు, వెడెల్పు 16 మీటర్లు. (Image Credit : KTR Twitter)
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో పూర్తైన 17వ ప్రాజెక్టు ఇది. (Image Credit : KTR Twitter)
ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ జంక్షన్ మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది మూడోది. (Image Credit : KTR Twitter)
శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరగనుంది. (Image Credit : KTR Twitter)
శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్