No Google in China: చైనాలో గూగుల్, వాట్సాప్ లేవు.. అక్కడి ప్రజలు ఎలా బతికేస్తున్నారు
చైనాలో అత్యధికంగా ఉపయోగించే యాప్ WeChat దీనిని మీరు చైనా సూపర్ యాప్ అని పిలవచ్చు. ఇది చాటింగ్ తో పాటు ఆల్ ఇన్ వన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ గా సేవలు అందిస్తు్ంది. ఇదే యాప్‌లో చెల్లింపులు, టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. చిన్న గేమ్స్ కూడా ఆడతారు. ఒకే యాప్‌తో ప్రజల దాదాపు ప్రతి అవసరం తీరుతుంది.
సోషల్ మీడియా పరంగా చూస్తే, చైనాలో Douyin అనే యాప్ ఉంది. ఇదే యాప్ ఇతర దేశాలలో TikTok పేరుతో ఫేమస్ అయింది. ఇందులో వినియోగదారులు మ్యూజిక్, ఫిల్టర్లు, ఎఫెక్ట్‌లతో వీడియోలు క్రియేట్ చేస్తారు. ఇదే యాప్ ద్వారా నేరుగా ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈకామర్స్ విషయానికి వస్తే.. చైనాలో Xiaohongshu అంటే “లిటిల్ రెడ్ బుక్” అనే యాప్ చాలా ఫేమస్ ఇది షాపింగ్, సోషల్ మీడియాల కోసం వినియోగించే యాప్. చైనా ప్రజలు ఫ్యాషన్, అందం, ప్రయాణానికి సంబంధించిన పోస్ట్‌లను షేర్ చేస్తారు. కస్టమర్లు వాటికి సంబంధించిన ఉత్పత్తులను ఇందులో కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు అధకంగా ఈ యాప్ వినియోగస్తారు.
పేమెంట్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో UPI అతిపెద్ద మాధ్యమంగా ఉంది. చైనాలో Alipay, WeChat Pay హవా నడుస్తోంది. అలీబాబా గ్రూప్ యాప్ అయిన Alipay, చైనా డిజిటల్ పేమెంట్స్ కు వెన్నెముకగా భావిస్తారు.
ఆన్లైన్ షాపింగ్ కొరకు ఇక్కడ Taobao అతిపెద్ద ప్లాట్‌ఫాం ఉంది. ఇది Amazon లేదా Flipkart లాగా పనిచేస్తుంది. అదేవిధంగా Baidu చైనా దేశంలో Googleగా భావిస్తారు. ఇది ఫేమస్ సెర్చ్ ఇంజిన్, మ్యాప్స్, న్యూస్, ట్రాన్స్‌లేషన్, AI చాట్ వంటి సౌకర్యాలను అందిస్తుంది.
భోజనం, ట్రావెల్ బుకింగ్ కోసం Meituan యాప్ ఉపయోగిస్తారు. ఇది Swiggy, జొమాటో (Zomato) మరియు MakeMyTrip ల కలయిక లాంటి యాప్. చైనా విదేశీ యాప్లపై ఆధారపడకుండా తన సొంత డిజిటల్ యాప్ ప్రపంచాన్ని నిర్మించుకుంది. ప్రతి అవసరానికి చైనా దేశీయ వెర్షన్ అందుబాటులో ఉంది. అందుకే Google, వాట్సాప్ లేకుండా కూడా చైనా వినియోగదారులు టెక్నాలజీలో దూసుకెళ్తున్నారు.