Water Proof Mobiles in Budget : వాటర్‌ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లు.. 20 వేల కంటే తక్కువ బడ్జెట్లో, బెస్ట్ ఫీచర్స్ కూడా
కొత్తగా విడుదలైన Oppo K13 వాటర్‌ప్రూఫ్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి మంచి ఎంపిక. దీని ధర 17,999 రూపాయలు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే 7000mAh పెద్ద బ్యాటరీ ఉంది. 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనితో పాటు 8GB RAM మద్దతు ఉంది.
Moto G86 Power కూడా మంచి ఆప్షనే. ఇది16,999లకు అందుబాటులో ఉంది. 6720mAh బ్యాటరీని కలిగి ఉంది. ఎక్కువ కాలం బ్యాకప్ ఇస్తుంది. 6.7-అంగుళాల FHD+ p-OLED డిస్ప్లే ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. MediaTek Dimensity 7400 చిప్సెట్, 8GB RAMతో వస్తుంది. వర్షాకాలంలో ఇది మంచి ఎంపిక అవుతుంది.
Realme P3 16499కు అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసి.. 6000mAh బ్యాటరీతో వస్తుంది. 6.67-inch FHD+ AMOLED డిస్ప్లేతో పాటు.. Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్‌తో వచ్చింది. 8GB వరకు RAM ఆప్షన్‌తో వస్తుంది. బ్యాటరీ, పర్ఫార్మెన్స్పై మంచి రివ్యూలే ఉన్నాయి.
తాజాగా విడుదలైన iQOO Z10R కూడా 20 వేలలోపే అందుబాటులో ఉంది. 19,499 రూపాయలకు వచ్చేస్తుంది. 5700mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 8GB RAMతో వస్తుంది. పనితీరు అద్భుతంగా ఉంటుంది.
Xiaomi Redmi Note 14 5G కూడా ఈ జాబితాలో ఉంది. 16,999 రూపాయల ధర కలిగిన ఈ ఫోన్ 5110mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 6GB RAMతో రోజువారీ వినియోగానికి, మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.