అన్వేషించండి
West Indies vs Australia : ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 27 పరుగులకే వెస్ట్ ఇండీస్ ఆలౌట్! భారత్ గాయాన్ని రేపిన ఆసిస్
West Indies vs Australia : వెస్టిండీస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేసింది. టెస్ట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. భారత్ అత్యల్ప స్కోరు 2020 లో నమోదైంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్
1/6

ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ జమైకాలో జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక చెడు రికార్డును నమోదు చేసింది. వారు కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక్కడ టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు అత్యల్ప స్కోరు ఎంత ఉందో చూడండి
2/6

వెస్టిండీస్ మూడో రోజున 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగింది. కాని వెస్టిండీస్ కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు. వెస్టిండీస్ ఈ మ్యాచ్‌ను176 పరుగుల తేడాతో ఓడిపోయింది.
3/6

వెస్టిండీస్ ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ అవ్వడంలో మిచెల్ స్టార్క్ ప్రధాన పాత్ర పోషించాడు. స్టార్క్ వెస్టిండీస్‌పై విజృంభించాడు. స్టార్క్ 7.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
4/6

భారత టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు విషయానికి వస్తే, అది 2020 లో ఆస్ట్రేలియాపైనే నమోదైంది. ఆ టైంలో భారత జట్టుకు దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నారు.
5/6

భారత జట్టు సిరీస్ మొదటి మ్యాచ్‌లో అడిలైడ్ మైదానంలో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్వుడ్ 5 వికెట్లు, పాట్ కమ్మిన్స్ నాలుగు వికెట్లు తీసుకున్నారు.
6/6

భారత జట్టు సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ భారత జట్టు ఈ సిరీస్‌లో చరిత్ర సృష్టించింది. భారత జట్టు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1 తేడాతో సిరీస్‌లో ఓడించింది.
Published at : 15 Jul 2025 11:23 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















