Joe Root : టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్, నంబర్-3కి చేరిన జో రూట్; జాబితాలో ఉన్న ఇండియన్స్ ఎంతమంది?
Top 5 batsmen in Tests: భారత్‌తో జరుగుతున్న నాల్గో టెస్టులో జో రూట్ చరిత్ర సృష్టించాడు. రూట్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్ ఎవరో ఇక్కడ చూడండి. టాప్-5 జాబితాలో ఇద్దరు భారత దిగ్గజాలు ఉన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTop 5 batsmen in Tests: నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ముందు రూట్ 13259 పరుగులు చేశాడు. అతను టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 5వ స్థానంలో ఉన్నాడు. కానీ నాల్గో టెస్ట్ మ్యాచ్‌లో రూట్ రాహుల్ ద్రవిడ్, జాక్ కలిస్ ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు.
Top 5 batsmen in Tests: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 200 మ్యాచ్‌లలో దాదాపు 54 సగటుతో 15921 పరుగులు చేశాడు. అతను 68 అర్ధ సెంచరీలు, 51 సెంచరీలు సాధించాడు.
Top 5 batsmen in Tests: ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. పాంటింగ్ దాదాపు 52 సగటుతో 168 మ్యాచ్‌లలో 13,378 పరుగులు చేశాడు. ఈ సమయంలో పాంటింగ్ 62 అర్ధ సెంచరీలు, 41 సెంచరీలు సాధించారు.
Top 5 batsmen in Tests:రూట్ మూడో స్థానానికి చేరుకోవడంతో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కాలిస్ నాల్గో స్థానానికి పడిపోయారు. కాలిస్ 166 మ్యాచ్‌లలో 55.37 సగటుతో 13,289 పరుగులు చేశారు. కాలిస్ 58 అర్ధ సెంచరీలు, 45 సెంచరీలు సాధించారు.
Top 5 batsmen in Tests: భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఈ జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నారు. రాహుల్ 164 టెస్టుల్లో 5231 సగటుతో 13288 పరుగులు చేశారు. రాహుల్ ఈ సమయంలో 63 అర్ధ సెంచరీలు, 36 సెంచరీలు సాధించారు.