ప్రతి మంగళవారం హనుమాన్ పూజ ఇలా చేస్తే శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి!
హిందూ ధర్మంలో మంగళవారం రోజున హనుమంతుని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమాన్ ని పూజిస్తారో వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం
మంగళవారం రోజు మంగళ గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుని వ్రతం ఆచరించడం ద్వారా మంగళ గ్రహ దోషాలు, ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ముఖ్యంగా మంగళ గ్రహ దోషంతో బాధపడేవారు మంగళవారం నాడు హనుమంతుని పూజిస్తారు. హనుమంతుడు అన్ని రకాల దోషాలను తొలగించే దేవుడిగా కొలుస్తారు.
మంగళవారం నాడు పూజ చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆవాల నూనెతో దీపం వెలిగించడం , ఎరుపు రంగు వస్త్రాలు లేదా పువ్వులు సమర్పించడం చాలా ఫలవంతం అవుతుంది. దీనితో పాటు హనుమాన్ కి బెల్లం, శనగలు నైవేద్యంగా సమర్పించడం శుభంగా భావిస్తారు
ధార్మిక విశ్వాసాల ప్రకారం హనుమంతుడు మంగళవారం జన్మించాడని చెబుతారు. అందుకే మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తులకు బలం, బుద్ధి, విద్య , జ్ఞానం లభిస్తుందని నమ్మకం. మానసిక శాంతి , ఆత్మవిశ్వాసం కలిగించడమే కాకుండా వారి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలను కూడా దూరం చేస్తుంది.
మంగళవార వ్రతం చేసేవారు జీవితంలో ఎప్పుడూ బాధపడరని చెబుతారు. వివాహంలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడానికి, ఉద్యోగంలో పురోగతిని సాధించడానికి, ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడానికి మంగళవారం పూజ అత్యంత అవసరం.
మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల భక్తులను చెడు శక్తులు, భయాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం . ఓం హనుమతే నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి.