దీపావళి పూజకోసం కొన్న లక్ష్మీ గణేష్ విగ్రహాలను ఆ తర్వాత ఏం చేయాలి?
దీపావళి రోజున లక్ష్మీ గణేశుల విగ్రహాలను ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పూర్తి భక్తి శ్రద్ధలతో విధి విధానంగా పూజలు చేస్తారు. అయితే దీని తర్వాత కొత్త విగ్రహానికి పూజ చేసిన తర్వాత పాత విగ్రహాన్ని ఏం చేయాలి అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంది.
దీపావళి రోజున లక్ష్మీ గణేశుల కొత్త విగ్రహాలను తెచ్చి పూజిస్తారు. అయితే పాత విగ్రహాలను పడేయడం..ముఖ్యంగా చెత్తలో వేసేయడం అశుభం
దీపావళి తర్వాత పాత విగ్రహాన్ని కూడా పూజించండి.. ఆ తర్వాత విగ్రహానికి శాస్త్రోక్తంగా ఉద్వాసన చెప్పి..కొత్త విగ్రహాలను అదే స్థానంలో ప్రతిష్టించండి
లక్ష్మీ గణేష్ పాత విగ్రహాలను ఏదైనా నది లేదా చెరువులో నిమజ్జనం చేయండి. మట్టి పర్యావరణ అనుకూలంగా ఉంటే ఇంట్లో కూడా ఏదైనా తొట్టె, బకెట్ లేదా కుండలో నీరు పోసి నిమజ్జనం చేయవచ్చు.
పూజ కోసం మట్టి విగ్రహాన్ని మాత్రమే వినియోగించండి. మట్టిని.. కొత్త జీవితం - క్షణికత్వాన్ని కూడా సూచిస్తాయి. అందుకే పూజ తర్వాత వాటిని నిమజ్జనం చేయడం అవసరం.
లక్ష్మీ గణేష్ విగ్రహాలు బంగారం, వెండి లేదా ఇత్తడి వంటి లోహాలతో తయారు చేస్తే .. మీరు గంగాజలంతో శుభ్రం చేసి, ప్రతి సంవత్సరం దీపావళి పూజలో ఈ విగ్రహాలను ఉపయోగించవచ్చు. వాటిని మార్చాల్సిన అవసరం లేదు లేదా నిమజ్జనం చేయవలసిన అవసరం లేదు. లోహంతో చేసిన విగ్రహాలను శాశ్వతంగా పరిగణిస్తారు.