సాయంత్రం వేళ ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి, లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్లిపోతుంది!
సాయంత్రం లక్ష్మీదేవి రాక సమయం. అందువల్ల సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాల్లో ఉంది. ఏఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకోండి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాయంత్రం సమయంలో పాలు, పెరుగు, ఉప్పు వంటి తెల్లటి వస్తువులను ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో ఎవరికైనా ఈ వస్తువులు ఇస్తే, అది జాతకంలో శుక్రుడిని బలహీనపరిచి ఆర్థిక సమస్యలకు కారణం కావచ్చు.
సూర్యాస్తమయం తర్వాత డబ్బు లావాదేవీలు చేసే వారిపై కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. ఎందుకంటే ఇది ధన దేవత లక్ష్మి రాక సమయం. అటువంటి సమయంలో డబ్బు అప్పుగా ఇస్తే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు.
తులసి పూజనీయమైనది మాత్రమే కాదు, ఔషధ గుణాలు కలిగిన మొక్క కూడా. సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా తులసి ఆకు లేదా మొక్కను అడిగితే పొరపాటున కూడా ఇవ్వకండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ పసుపు అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో పసుపు ఇవ్వడం వల్ల గురు గ్రహ స్థితి బలహీనపడుతుంది, దీని ప్రభావం సుఖ సంతోషాలపై పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవ్వకూడదని చెబుతారు. దీనికి కారణం వెల్లుల్లి ఉల్లిపాయలకు కేతు గ్రహానికి సంబంధం ఉంది. అందుకే సూర్యాస్తమయం తర్వాత వీటిని ఇవ్వొద్దని చెబుతున్నారు పండితులు