Vivah Panchami 2025: త్వరగా పెళ్లి కావాలంటే నవంబర్ 25 వివాహ పంచమి రోజు ఈ చిన్న పరిహారాలు చేయండి!
వివాహ పంచమి పండుగను సీతారాముల వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ తేదీ మార్గశిర మాసం శుక్ల పక్షం పంచమి రోజున వస్తుంది. ఈ సంవత్సరం వివాహ పంచమి మంగళవారం 2025 నవంబర్ 25 న వస్తుంది.
వివాహ పంచమి పవిత్రమైన రోజు, వివాహంలో ఏదో ఒక కారణంతో ఆటంకాలు ఎదుర్కొంటున్నా.. వివాహం జరగని వ్యక్తులకు ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు
మీరు కూడా వివాహంలో ఆలస్యం అవుతున్న లేదా పెళ్లికి అడ్డంకులు ఎదురవుతున్న యువకుడు లేదా యువతి అయితే, వివాహ పంచమి రోజున ఈ సులభమైన చర్యలు తప్పకుండా చేయండి.
జ్యోతిష్య శాస్త్ర పండితులు అనీష్ వ్యాస్ ప్రకారం వివాహ పంచమి శుభ తిథి నాడు 11 పసుపు కొమ్ములు , 11 దూర్వాలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి గణేశుడికి సమర్పిస్తూ మీ మనోవాంఛను చెప్పండి.
వివాహ పంచమి రోజున రాముడు-సీతను పూజించండి. సీతకు ఎర్రని వస్త్రం, గాజులు, బొట్టు, సింధూరం, అలంకరణ సామాగ్రిని సమర్పించండి. ఈ పరిహారంతో వివాహంలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి...తగిన జీవిత భాగస్వామి లభిస్తారు.
వివాహ పంచమి రోజున చిన్న బాలికలను ఆహ్వానించి, వారికి భోజనం పెట్టి బహుమతులు ఇవ్వండి. వివాహ పంచమి నాడు చేసే ఈ ఆచారంతో ఇఇంట్లో అవివాహితులకు వెంటనే వివాహం నిశ్చయమవుతుంది