భారతదేశంలో ఈ దేవాలయాల్లో VIP దర్శనం బంద్! కారణం ఏంటంటే?

VIP darshan banned in temple
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో 20 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలోని చాలా ఆలయాల్లో VIP దర్శనం ఉంటుంది, ఇది దేవాలయాల ఆదాయానికి ఒక మార్గం కూడా. అయితే కొన్ని దేవాలయాలు VIP దర్శనం వ్యవస్థను నిలిపేశాయి..
ఉత్తర ప్రదేశ్ లోని బంకే బిహారీ ఆలయంలో ఇకపై VIP దర్శన వ్యవస్థ ఉండదు. సామాన్య, ప్రత్యేక భక్తులందరూ ఒకే వరుసలో నిలబడి బంకే బిహారీని దర్శించుకుంటారు. ఆలయ కమిటీ VIP గ్యాలరీని తొలగించడానికి కూడా అంగీకరించింది.
బంకే బిహారీ మందిరంలోకి ప్రవేశ నిష్క్రమణ నిబంధనలలో కూడా మార్పులు చేశారు. ఇకనుంచి ఆలయంలోకి ప్రవేశించడానికి , నిష్క్రమించడానికి వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం బాంకే బిహారీ జీ దర్శనాన్ని లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తారు.
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో రద్దీని నియంత్రించడంతో పాటు దర్శనాలలో పారదర్శకతను కొనసాగించడానికి వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఇక్కడ అందరికీ దర్శనం కోసం ఒకే నియమాలు ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయంలో మహాశివరాత్రి ... ఇతర మతపరమైన కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా వీఐపీ దర్శనం పూర్తిగా రద్దు చేస్తారు
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్, తుల్జా భవానీ మందిరంలో కూడా వీఐపీ దర్శన పాస్ లను పూర్తిగా రద్దు చేశారు. వాస్తవానికి, ఆలయ పరిపాలనకు వీఐపీ పాస్ ల పంపిణీ విషయంలో అవినీతి ఫిర్యాదులు అందాయి..దీంతో వీఐపీ వ్యవస్థను రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న కనక దుర్గా దేవాలయంలో భక్తులకు సులభంగా దర్శనం కల్పించడానికి .. అధిక సంఖ్యలో ఉన్న భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక రోజులలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తారు.
తిరుమలలోనూ ప్రత్యేక ధార్మిక కార్యక్రమాల సందర్భంగా వీఐపీ దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటారు టీటీడీ అధికారులు