మంచం కింద, పరుపు కింద పేపర్లు, ఫైల్స్ పెట్టే అలవాటుందా! ఈ ఒక్క అలవాటు మార్చుకోకుంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువు ఉంచే ప్రదేశం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పడుకునే స్థలం అంటే జీవితంలో శాంతి , శక్తితో ముడిపడి ఉంటుంది. 90 శాతం మంది పాత కాగితాలు, ఫైళ్లు లేదా పత్రాలను తమ దిండు కింద ఉంచుతారు, అయితే ఈ అలవాట్లు వాస్తు ప్రకారం తప్పుగా పరిగణిస్తారు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మంచం శుభ్రంగా ఉండాలి, ఎందుకంటే ఇది సుఖసంతోషాలకు సంబంధించినదిగా చెబుతారు. దిండు కింద పాత , ఉపయోగించని కాగితాలు లేదా పత్రాలను ఉంచడం వల్ల ఆర్థిక ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. వ్యక్తి ధనానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
మంచం కింద కూడా అస్తవ్యస్తంగా పాత కాగితాలు ఉంచడం వల్ల మంచం కింద మురికి పేరుకుపోవడమే కాకుండా, ఇది ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తుంది. నిద్రపోయేటప్పుడు శరీరానికి విశ్రాంతి అవసరం, కానీ మంచం కింద ఉంచిన వస్తువుల వల్ల మనస్సు, మెదడు అశాంతికి గురవుతాయి, దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
మంచం కింద, పరుపు కింద పేరుకుపోయిన మురికి..ఇంట్లో అశాంతికి, గొడవలకు కారణం అవుతుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఈ ప్రభావం వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుందని..భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు పెంచుతుందని చెబుతారు
పాత కాగితాలు, పత్రాల్లో ధూళి తేమ పేరుకుపోవడం వల్ల పరిసరాలు కలుషితమవుతాయి. నిద్రించే ప్రదేశంలో ప్రతికూల శక్తి ఉండటం వల్ల వ్యక్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి అలసట వంటి సమస్యలు వస్తాయి.
మీ దగ్గర పాత డాక్యుమెంట్లు ఉంటే వాటిని మంచం కింద పెట్టకుండా బీరువా, లాకర్ లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. సమయానికి పనికిరాని కాగితాలను తీసి పారవేయండి. మంచం కింద స్థలం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ ఎలాంటి పనికిరాని వస్తువులను ఉంచకుండా ఉండండి.