వంటగదిలో ఈ 5 వస్తువులు అవసరం లేదు - తీసివేయకపోతే డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది!
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన వస్తువులు ఆర్థిక స్థితి, శక్తి , శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులు త్వరగా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి .. ధన నష్టానికి కారణం కావచ్చు. కాబట్టి మీ వంటగదిలో కూడా ఈ వస్తువులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి.
శుభ్రపరిచే వస్తువులు- వాస్తు నిపుణుడు అనీష్ వ్యాస్ చెబుతున్నాడు, వంటగదిని దేవాలయానికి సమానంగా పవిత్రంగా భావిస్తారు . ఇక్కడ అన్నపూర్ణ మాత కొలువై ఉంటుంది. అందువల్ల ఇక్కడ శుభ్రపరచడానికి సంబంధించిన వస్తువులను అంటే చీపురు లేదా తుడిచే గుడ్డ వంటివి ఉంచకూడదు. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.
మందులు- వంటగదిలో పొరపాటున కూడా మందులు ఉంచకూడదు. వంటగదిలో మందులు ఉంచడం అశుభంగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో రోగాలూ, దోషాలూ తగ్గడానికి బదులు మరింత పెరుగుతాయి.
పాత కాగితాలు వంటగదిలో పాత కాగితాలు బిల్లులు పత్రాలు మొదలైనవి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అశుద్ధ శక్తి ప్రవాహం వేగంగా పెరుగుతుంది. అందువల్ల వంటగదిలో ఈ వస్తువులను కూడా ఉంచవద్దు.
చెత్త బుట్ట- చాలా మంది వంటగదిలో సింక్ కిందనే చెత్త బుట్ట ఉంచడానికి స్థలం ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదు. దీనికి కారణం ఏమిటంటే, సింక్ నీటి మూలకానికి సంబంధించినది. నీటిలో వరుణ దేవుడు ఉంటాడని నమ్ముతారు. నీటి మూలకం ఉన్న ప్రదేశంలో చెత్త ఉంచడం వల్ల వరుణ దేవుడు కోపించవచ్చు.
ఖాళీ పాత డబ్బాలు వంటగదిలో ఖాళీ పాత డబ్బాలు అస్సలు ఉంచకూడదు. ధాన్యం లేని డబ్బాలు లేదా కంటైనర్లు వంటివి వంటగదిలో ఉంచడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది.