Vastu Tips for Happy Home : ధనవంతుల ఇళ్లలో ఈ మొక్కలు ఉంటాయి, వాస్తు దోషాన్ని తొలగించి కనకవర్షం కురిపిస్తాయ్ ఇవి!
మొక్కలు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. వాస్తు శాస్త్రంలో దురదృష్టం , వాస్తు దోషాలను తొలగించడానికి ప్రభావవంతమైన మొక్కల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లో నాటిన వెంటనే ధనం అయస్కాంతంలా ఆకర్షిస్తుంది.
జెడ్ ప్లాంట్: క్రస్సుల మొక్కను ఇంట్లో నాటిన వెంటనే డబ్బు సమస్యలు తొలగిపోవచ్చు. దీనిని జేడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. నాణేల వంటి చిన్న చిన్న ఆకులతో కూడిన ఈ మొక్క ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తులసి: హిందూ ధర్మంలో తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను నాటి, ప్రతిరోజూ పూజలు చేయడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి
వెదురు: చిన్న వెదురు మొక్కను ఇంట్లో నాటడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు మాత్రమే కాదు, ఫెంగ్ షుయ్ కూడా ఈ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తుంది. ఇంటి తూర్పు దిశలో దీన్ని నాటడం వల్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తారు
స్నేక్ ప్లాంట్: స్నేక్ ప్లాంట్ ఉంచడం వల్ల సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు వాస్తు నిపుణులు. దీన్ని స్టడీ రూమ్‌లో ఉంచినట్లయితే జ్ఞాపకశక్తి పెరుగుతుందట. బెడ్ రూమ్ లోనూ పెట్టుకోవచ్చు
మనీ ప్లాంట్: ఈ మొక్క ధనాన్ని ఆకర్షించడానికి అత్యుత్తమంగా చెబుతారు. మనీ ప్లాంట్ శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది, ఇది ధనం, విలాసం, సుఖం, సౌభాగ్యం , ఐశ్వర్యానికి కారకంగా పరిగణిస్తారు. ఈ మొక్క పెరిగేకొద్దీ, మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.