బూట్లకు సంబంధించిన ఈ తప్పులు వాస్తు దోషానికి కారణమవుతాయి!
వాస్తు శాస్త్రంలో బూట్ల పాత్ర చాలా ముఖ్యమైనది. బూట్లు మన పాదాలకు సంబంధించినవి. వంటగది లేదా పూజా గదిలో బూట్లు ధరించడం, తలగడ దగ్గర బూట్లు ఉంచడం వల్ల అశాంతి, అడ్డంకులు ప్రతికూలత పెరుగుతాయి.
బూట్లు ధరించి వంటగదిలోకి ప్రవేశించే వ్యక్తి ఆరోగ్యంపై గ్రహాలు ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. బయట ధరించే చెప్పులు ఇంటిలోపలుకు వేసుకుని వచ్చినా ఇదే ఫలితం ఉంటుంది. అందుకే వంటగదిలో వినియోగించే చెప్పులు ప్రత్యేకంగా ఆ ఒక్క గదికే పరిమితం కావాలి
పాత చెప్పులు శని-రాహువులను ఆకర్షిస్తాయి. దీనివల్ల మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మీ బూట్లను ఎల్లప్పుడూ పాలిష్ చేసి ఉంచుకోండి. శుభ్రమైన బట్టలు , బూట్లు ధరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
చాలా మంది బయట నుంచి బూట్లు వేసుకుని ఇంట్లోకి వచ్చి వాటిని మంచం తల దగ్గర తీసి పడేస్తారు, ఇది సరికాదు. బూట్లను ఒక నిర్దిష్ట స్థలంలో షెల్ఫ్‌లో ఉంచండి. తల దగ్గర బూట్లు ఉంచడం వల్ల మానసిక సమస్యలతో పాటు ఒత్తిడి పెరుగుతుంది.
బూట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. మురికి బూట్లు రాహువు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి, దీని వలన మీకు మానసిక ఒత్తిడి, బద్ధకం, భారంగా అనిపించడం జరుగుతుంది