శాస్త్రం నుంచి విజ్ఞానం వరకు హెచ్చరిక! చీకటి పడ్డాక తులసి ఆకులు తుంచితే ఏం జరుగుతుందో తెలుసా?
హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తులసిని పూజించడంతో పాటు, దానిని తాకడానికి లేదా తుంచడం చేయడానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో తులసిని కోయడం శాస్త్రాలలో నిషేధం
శాస్త్రాల ప్రకారం ఆదివారం, ఏకాదశి, గ్రహణం వంటి రోజుల్లో తులసి కోయడం నిషేధం. అయితే, రాత్రి సమయంలో కూడా తులసిని కోయకూడదు.
శాస్త్రం , విజ్ఞానం రెండింటి ప్రకారం, రాత్రి సమయంలో ఏ చెట్టునైనా లేదా మొక్కను తాకకూడదు.. విరచకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో తులసి ఆకులను అస్సలు కోయకూడదు
శాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలో తులసిని తుంచడం లేదా తాకడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట. రాత్రి సమయంలో తులసిని తుంచడం కుటుంబం మానసిక ఒత్తిడి , ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని నమ్ముతారు.
రాత్రి సమయంలో మొక్కల స్వభావం శాస్త్రీయంగా మారుతుంది. తులసి రాత్రి సమయంలో శ్వాసక్రియను తగ్గిస్తుంది . అందువల్ల, రాత్రి సమయంలో తులసిని తెంపడం వల్ల శక్తి మ, ఔషధ గుణాలు కూడా తగ్గుతాయి.
శాస్త్రాల ప్రకారం తులసికి నీరు సమర్పించడానికి లేదా తుంచడానికి సూర్యోదయ సమయం ఉత్తమమైనది. ఉదయం సమయంలో మొక్క తాజాగా సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో తులసి ఆకులు మరియు వేర్లు ఇంట్లో సుఖం, సమృద్ధి మరియు శాంతిని తీసుకురావడానికి చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు
రాత్రి సమయంలో మొక్క చుట్టూ తిరగడం లేదా ఆకులు కోయడం చేయకుండా ఉండాలి. అలాగే, తులసి మొక్కను ఎప్పుడూ శుభ్రమైన , సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి.
శాస్త్రాలలో చెప్పిన ఈ నియమాలు కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, ఇవి ఇంటి శ్రేయస్సు, ఆరోగ్యం మరియు శాంతికి సంబంధించినవి. అందువల్ల తులసిని తెంపేటప్పుడు, తాకేటప్పుడు లేదా పూజించేటప్పుడు, దీనికి సంబంధించిన నియమాలను పాటించాలని సూచిస్తున్నారు పండితులు.