భోజనం చేసే ప్లేట్ తో ఆహారం వదిలేసే అలవాటు మీకు ఉందా? ఇది తప్పకుండా తెలుసుకోండి!
పెద్దలు తరచుగా చెబుతుంటారు.. ఎంత తినాలనుకుంటున్నారో అంత మాత్రమే ప్లేట్‌లో పెట్టుకోండి అని. కానీ కొంతమంది ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టుకుంటారు..వదిలేస్తుంటారు. ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని వదిలివేయడం అంటే అన్నపూర్ణ అమ్మవారిని అవమానించినట్టే
భోజనం వదిలేసేవారి జీవితంలో ధనం, అన్నం, సుఖం, సమృద్ధి లోపం ఏర్పడుతుంది. చాలామంది ఏముందిలే అనుకుంటారు కానీ ఇది నిజంగా ప్రభావం చూపుతుంది.
ఆహారాన్ని అవమానించేవారి ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు, మీరు ఎన్ని పూజలు చేసినా...భగవంతుడి ఆశీర్వాదంతో పాటూ పూర్వీకుల ఆశీర్వాదం లభించదు. శని దేవుని ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
నిత్యం ఆహారాన్ని వృధాచేసేవారి జాతకంలో చంద్రుడు బలహీనపడతాడు..వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వారిపై ఎప్పటికీ చెడు ప్రభావం ఉంటుంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారానికి సంబంధించిన తప్పులు వ్యక్తి నిర్లక్ష్యం మాత్రమే కాదు, జాతకంలో బుధుడు , గురువు బలహీనంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. ఆహారాన్ని గౌరవించకపోతే జీవితంలో చెడు ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది.
చాలామంది ఎంగిలి ప్లేట్ లో మిగిలిన ఆహారాన్ని ఆవులకు ఆహారంగా వేస్తారు. కానీ ఇది చాలా తప్పు.. సకల దేవతలు కొలువుండే గోమాతకు ఎంగిలి ఆహాసం, ఉల్లి వెల్లుల్లి కలిసిన ఆహారం వేయకూడదు