Srisailam Maha Shivaratri Brahmotsavam 2025 : శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - హంసవాహనంపై ఆది దంపతులు!
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఫిబ్రవరి 21 శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాల నడుమ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు
ఈ వాహనసేవ చూసి తరించేందుకు వచ్చిన వేలాది భక్తులతో పురవీధులు కిక్కిరిసాయి
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూర వాహనసేవ నిర్వహిస్తారు
నాలుగో రోజు..కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంనుంచి ఉదయం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు..
ఫిబ్రవరి 22 శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు.
హంసవాహనంపై ఆది దంపతులు!