అన్వేషించండి
Kashmir: అనంతనాగ్ లో జలపాతం నుంచి బయటపడిన పురాతన శివలింగం, ఇతర విగ్రహాలు ఇవే!
అనంతనాగ్ లో పురాతన జలపాతంలో 7వ, 9వ శతాబ్దాల నాటి విగ్రహాలు లభించాయి. శివలింగం, హిందూ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. ఆ ఫొటోలు, పూర్తి వివరాలు చూద్దాం...
Ancient Hindu murtis and Shivlings unearthed in Anantnag - అనంతనాగ్ లో లభించిన విగ్రహాలు
1/8

అనంతనాగ్ లో పురాతన శివలింగం , దేవతా విగ్రహాలు లభించాయి. విగ్రహాలు ఒక పవిత్రమైన నీటి బుగ్గలో ఉన్నాయి. ఈ విగ్రహాలు 7వ-9వ శతాబ్దానికి చెందినవి.
2/8

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ మధ్యకాలంలో నీటిమట్టం తగ్గడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు జలపాతం లోపల ఒక చిన్న పెట్టె లాంటి రాతి నిర్మాణాన్ని గుర్తించారు. ఇందులోంచి విగ్రహాలు బయపడ్డాయి
3/8

కూలీలు వెంటనే సలుయా పంచల్పోరా నాగబల్ కమిటీ అధ్యక్షుడు సతరు జీకి సమాచారం అందించారు, ఆయన విగ్రహాలను భద్రపరచాలని సలహా ఇచ్చారు.ఆ విగ్రహాలు మేం దాచిపెట్టొచ్చు కానీ అవి పవిత్రమైనవి అని తెలుసు..అందుకే ఆ రోజు నుంచి రాత్రి సమయంలోనూ విగ్రహాల దగ్గర కాపలా కాస్తున్నాం అని అక్కడ పనిచేసే కూలీలు చెప్పారు
4/8

స్థానికంగా కర్కూట్ నాగ్ అని పిలిచే ఈ ప్రదేశం కాశ్మీరీ పండితులకి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. చాలా మంది దీనిని 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు కాశ్మీర్ ను పాలించిన కర్కూట్ రాజవంశంతో అనుసంధానిస్తారు.
5/8

స్థానిక వివరాల ప్రకారం, ఈ జలపాతం రాజవంశ పాలకులు ప్రార్థనలు చేసిన ప్రారంభ ప్రదేశాల్లో ఒకటి. ఇది తరతరాలుగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది.
6/8

ఈ ప్రాంతానికి చెందిన కాశ్మీరీ పండిట్ సన్నీ రైనా మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు, ఇది మన సజీవ చరిత్రలో భాగం. కర్కోట రాజులు ఇక్కడే తమ మొదటి ఆచారాలు నిర్వహించారని నమ్ముతారు. ఈ పరిశోధన ఆ సంబంధాన్ని ధృవీకరిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్, పురావస్తు మ్యూజియంల విభాగం అధికారులు ఈ స్థలాన్ని సందర్శించారు.
7/8

ఒక అధికారి మాట్లాడుతూ విగ్రహాల వయస్సు మూలాన్ని తెలుసుకోవడానికి వాటిని మెటీరియల్ , కార్బన్ డేటింగ్ పరీక్ష కోసం శ్రీనగర్ కు పంపుతామని చెప్పారు.
8/8

స్థానిక ముస్లిం సమాజం ప్రదర్శించిన మత సామరస్యం, వారు విగ్రహాలను రక్షించడమే కాకుండా, వాటిని గౌరవించారు.
Published at : 05 Aug 2025 07:30 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
విజయవాడ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















