Sawan 2025 : శ్రావణ మాసంలో శివునికి ఈ వస్తువులు సమర్పిస్తే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది!
శివుని పూజలు చేయడానికి మరియు ఆరాధించడానికి శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ పవిత్ర శ్రావణ మాసంలో శివలింగంపై కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి
శ్రావణ మాసంలో శివలింగంపై మిరియాలు సమర్పించడం వల్ల రోగాలు నయం అవుతాయి.
ఆ శివలింగంపై నెయ్యి సమర్పించడం వల్ల మానసిక శక్తి మెరుగుపడుతుంది , ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
శ్రావణ మాసం పవిత్ర మాసంలో శివలింగంపై ఆవాల నూనె సమర్పించడం వల్ల శత్రువుల నాశనం జరుగుతుంది.
ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో లేదా రావాల్సిన డబ్బులు ఆగిపోయాయో, వారు శ్రావణ మాసంలో శివలింగంపై చక్కెరను సమర్పించడం ద్వారా సంపదను పొందుతారు.
ఏదైనా పనిలో ఆటంకం కలిగినా లేదా పూర్తవుతుంది అనుకున్న పని చెడిపోయినా శ్రావణ మాసంలో శివలింగంపై లవంగాలు సమర్పించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి , అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి.
వాస్తు దోషం లేదా పితృ దోషం ఉంటే, శ్రావణ మాసం లో శివలింగంపై అపరాజిత పువ్వులు సమర్పించడం వల్ల అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శ్రావణ మాసంలో మందార పువ్వు శివలింగంపై సమర్పించడం వల్ల కీర్తి , ప్రతిష్ట పెరుగుతుంది