పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?

పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా లేక వాయిదా వేయాలా?
ఈ ఏడాది (2026) సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు పితృ పక్షం. ఈ రెండు వారాలు శుభానికి సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు చేయకూడదనే నమ్మకం చాలా కుటుంబాలలో ప్రచారంలో ఉంది, కానీ అన్ని రకాల కొనుగోళ్లను నిషేధిస్తూ శాస్త్రాలలో స్పష్టమైన నియమం ఏదీ లేదు.
దేవతని ఏకాదశి తర్వాత వివాహాలు ప్రారంభమవుతాయి..అందుకు ముందే పెళ్లి సన్నాహాలు , కొనుగోళ్లు మొదలుపెడతారు. శుభ సమయమైన ముహూర్త చింతామణి ప్రకారం.. సంవత్సరం పొడవునా కొనుగోళ్లు చేసుకోవచ్చు. అందువల్ల, పితృ పక్షంలో వస్తువులు కొనడం స్వతహాగా అశుభంగా పరిగణించరు
శ్రాద్ధ పక్షాన్ని దుఃఖించే సమయంగా భావించడం సరికాదు. దీనిని పూర్వీకులను స్మరించుకోవడానికి, కర్మకాండలు చేయడానికి, దానధర్మాలు చేయడానికి ..సంయమనం పాటించడానికి కేటాయించిన సమయంగా పరిగణిస్తారు.
శాస్త్రాలు శ్రాద్ధ స్ఫూర్తిని భక్తితో కూడిన దానాలు, పూజలు , పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే కర్మకాండలతో ముడిపెడతాయి. అందువల్ల, ఈ సమయంలో సానుకూల, సద్గుణమైన పనులకు ప్రాధాన్యత ఇస్తారు
వివాహం పితృ పక్షం తర్వాత జరిగితే, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడంపై శాస్త్రపరంగా స్పష్టమైన నిషేధం ఏదీ లేదు.