అన్వేషించండి
సంక్రాంతి, రథసప్తమి మాత్రమే కాదు సూర్యుడికి సంబంధించి ఎన్ని పండుగలు ఉన్నాయో తెలుసా?
Surya Dev Puja: సూర్యుని ఆరాధనతో ముడిపడిన ఛఠ్ పూజ ముగిసింది. హిందూ ధర్మంలో సూర్యారాధనకు సంబంధించిన మరిన్ని పండుగలు ఉన్నాయి.
Surya Dev
1/7

హిందూ ధర్మంలో సూర్యుడిని గ్రహంగానే కాకుండా దేవతగా కూడా పూజిస్తారు. మహాపర్వ ఛఠ్ సూర్య ఉపాసనతో ముడిపడి ఉన్న ముఖ్యమైన పండుగగా ఉత్తరాదిన పరిగణిస్తారు. అస్తమిస్తున్న , ఉదయిస్తున్న సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు.
2/7

దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, తేజస్సు, శక్తి, విజయం, సంతానం కోసం సూర్య భగవానుడిని పూజిస్తారు. సాధారణంగా సూర్య భగవానుడిని క్రమం తప్పకుండా పూజించడం మంచిది.
3/7

ఛట్ పూజతో పాటు హిందూ మతంలో సూర్య భగవానుడిని పూజించే అనేక పండుగలు ఉన్నాయి.
4/7

మకర సంక్రాంతి సూర్య దేవుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటారు, ఇది సాధారణంగా జనవరి 14-15 తేదీలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశగా కూడా ప్రయాణిస్తాడు. ఈ రోజున తెల్లవారుజామునే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు
5/7

రథ సప్తమి - మాఘ శుక్ల సప్తమి తిథి నాడు రథ సప్తమి పండుగ జరుపుకుంటారు. దీనిని సూర్య జయంతి, మాఘ సప్తమి, ఆరోగ్య సప్తమి లేదా మాఘ జయంతి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ రోజునే సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంపై ఆవిర్భవించాడని చెబుతారు
6/7

పొంగల్ తమిళనాడు , దక్షిణ భారత రాష్ట్రాలలో పొంగల్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు, ఇది నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగలో సూర్య భగవానుడిని పూజిస్తారు.
7/7

లోలార్క్ షష్ఠి- సంతానం కోసం భాద్రపద శుక్ల పక్ష షష్ఠి నాడు లోలార్క్ షష్ఠి పండుగ జరుపుకుంటారు. ఈ రోజున వారణాసిలో స్నానం ఆచరించి సూర్యభగవానుడిని ప్రార్థిస్తారు
Published at : 31 Oct 2025 08:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















