Varanasi: లక్షల దీపాలతో నిండిన కాశీ ఘాట్‌లు - కార్తీకమాసంలో శివయ్య వైభవం చూసినా జన్మ ధన్యమే!
RAMA | 06 Nov 2025 10:54 AM (IST)
1
కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగా నది రెండు ఘాట్లు దీపాకాంతులతో వెలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం దేవ దీపావళిని మరింత ఘనంగా నిర్వహించింది.
2
వారణాసి ఘాట్‌లలో లక్షలాది దీపాల వెలుగులు, లేజర్ షో భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
3
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు..
4
వారణాసిలో దూరంగా గంగా నది ఒడ్డున వెలుగుతున్న దీపాలను చూసి స్వర్గంలా ఉందంటున్నారు భక్తులు
5
దేవ్ దీపావళి సందర్భంగా కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు...భారీగా భక్తులు తరలివచ్చి విశ్వనాథుడిని దర్శించుకున్నారు
6
కార్తీక పౌర్ణణి రోజు దేవతలు స్వర్గలోకం నుంచి భూమికి దిగి వచ్చి దీపావళి జరుపుకుంటారని నమ్ముతారు. దేవతలు దీపావళి జరుపుకోవడం వల్లనే దీనిని దేవ దీపావళి అని పిలుస్తారు.