In Pics : హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కోదండ రాముడు
ABP Desam | 11 Apr 2022 10:55 PM (IST)
1
ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు భక్తులకు దర్శనమిచ్చారు.
2
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి కోదండరాముడిని దర్శించుకున్నారు.
3
భక్త జనసందోహంగా మారిన ఒంటిమిట్ట కోదండ రామాలయం పరిసరాలు
4
రాత్రి 8 గంటలకు హంస వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ నిర్వహించారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
5
హంస పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంటుంది. 'సోహం' భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి 'దాసోహం' అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
6
హంస వాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ రాముడు
7
హంస వాహనంపై ఒంటిమిట్ట కోదండ రాముడు