In Pics : శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడి చిద్విలాసం
అశేష భక్త జనకోటికి దర్శనమిచ్చిన శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతా సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరిగింది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
మందిరం, శ్రీమద్రామాయణం కల్పవృక్షం, గడియారం వేంకట శేష శాస్త్రి వారి రామాయణం, శ్రీ భూతపురి వారి రామాయణం, మొల్ల రామాయణం, రామచరిత మానస్, పోతన భాగవతంలోని అంశాలపై పలువురు పండితులు కవి సమ్మేళనం నిర్వహించారు.
భారత దేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట ఒంటిమిట్టలో శేష వాహనంపై కోదండరాముడు దర్శనమిచ్చారు.
శేషవాహనంపై కోదండరాముడు
శేషవాహనంపై సీతారాముడు
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
విద్యుత్ వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం
విద్యుత్ వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం