Happy Friendship Day 2025: హనుమాన్ - శని దేవుడికి స్నేహం ఎలా కుదిరిందంటే! ఆసక్తికరమైన కథ ఇక్కడ తెలుసుకోండి!
RAMA | 03 Aug 2025 08:00 AM (IST)
1
హనుమంతుడు శ్రీరాముడి కార్యంలో ఉండగా విఘ్నం కలిగించాలి అనుకున్నాడు శనిదేవుడు. ఇప్పుడు ఖాళీగా లేనని హనుమంతుడు హెచ్చరించినా వినలేదు. ఎన్నోసార్లు ఆపేందుకు ప్రయత్నించినా శని పట్టించుకోలేదు
2
అప్పుడు హనుమంతుడు..శనిని తోకతో బంధించాడు. విడిపించేందుకు సాయశక్తులా ప్రయత్నం చేశాడు.
3
ఆ సమయంలో శని దేవుడికి చాలా గాయాలయ్యాయి. కానీ తనను తాను హనుమంతుడి నుంచి విడిపించుకోలేకపోయాడు.
4
శనిదేవుడు తన తప్పును తెలుసుకుని హనుమంతుని క్షమించమని కోరాడు. హనుమంతుడిని మిత్రుడిగా చేసుకున్నాడు
5
శ్రీరామ భక్తులకు, హనుమంతుడిని పూజించేవారిపై ఇకపై తన ప్రభావం ఉండదని చెప్పాడు శని.
6
శనికి గాయాలవడంతో..హనుమంతుడు ఆవాల నూనె రాసి గాయాలు నయం అయ్యేలా చేశాడు. అప్పటి నుంచి శనికి ఆవాల నూనె సమర్పిస్తే ఆ భక్తులపై శని ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుందని చెబుతారు