దీపావళికి ముందే ఇంటి నుంచి ఈ 6 వస్తువులను బయట పడేయండి!
ఈ సంవత్సరం దీపావళి పండుగ 20 అక్టోబర్ 2025 సోమవారం వచ్చింది. దీపోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ ఇళ్లలో శుభ్రపరిచే కార్యక్రమం మొదలవుతుంది. కార్యాలయాలు, ఇళ్ళు, దుకాణాలలో శుభ్రపరచడంతో పాటు పాత వస్తువులను తీసివేసి కొత్త వాటిని తెస్తారు.
ఈ దీపావళి నాడు మీ ఇంటిని మాత్రమే అలంకరించుకోకండి, మీ ఇంట్లో అడ్డంకులు కలిగించే ప్రతికూల శక్తిని కూడా తొలగించండి. ఎందుకంటే కొన్నిసార్లు నిరంతరం తగాదాలు, సంబంధాలలో దూరం లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు దురదృష్టం కారణం కాదు, మీ ఇంట్లో ఉంచిన వస్తువులు కూడా దీనికి కారణం కావచ్చు.
ఈ దీపావళి సందర్భంగా ఇంట్లో సుఖసంతోషాలు కలగడానికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈ 6 వస్తువులను బయట పడేయండి.. లేకపోతే ప్రతికూల శక్తి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది.
ఈ దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు మీరు ఎప్పుడూ ధరించని పాత బట్టలను తీసివేయండి. ఇలా చేయడం వల్ల ఆ దుస్తులకు సంబంధించిన ప్రతికూల శక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి మనస్సు తేలికవుతుంది.
దీపావళి అంటే ఇల్లు ఊడ్చడం లేదా తుడవడం మాత్రమే కాదు, పగిలిన లేదా విరిగిన పాత్రలను కూడా బయట పడేయడం. ఇంట్లో పగిలిన పాత్రలను ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహం ఏర్పడుతుంది, ఇది మీ మనస్సు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
దీపావళి శుభ్రత సమయంలో మీరు వాడటం మానేసిన మందులను కూడా ఇంటి నుంచి బయట పడేయండి. పాత లేదా గడువు ముగిసిన మందులు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఇంట్లో ఉంచిన కాగితాలు, పాత బిల్లుల కుప్పలను కూడా పడేయండి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయట
ఇంట్లో జతకాని బూట్లు లేదా సాక్సులు పడి ఉంటే వాటిని వదిలించేసుకోండి.
ఇంటిలో ఇప్పటికే అలంకరించబడిన పాత అలంకరణ వస్తువులను ఈ దీపావళికి తొలగించి వాటి స్థానంలో కొత్త అలంకరణ వస్తువులను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల పాత శక్తి తొలగిపోయి కొత్త శక్తి ప్రసరిస్తుంది