ఛఠ్ పూజ మొదటిసారి చేస్తున్నట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!
ఈ ఏడాది ఛఠ్ పూజ 25 అక్టోబర్ శనివారం ప్రారంభమై 28 అక్టోబర్ సాయంత్రం అర్ఘ్యంతో ముగుస్తుంది. ఈ సమయంలో మొదటిసారి ఛఠ్ పూజ చేసే మహిళలు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి.
ఛఠ్ పూజా వ్రతం అత్యంత కఠినమైన వ్రతాలలో ఒకటి. అయితే మీరు మొదటిసారి ఛఠ్ వ్రతం చేస్తుంటే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఛఠ్ వ్రతం సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు
మహా పర్వ ఛఠ్ ప్రసాదం తయారు చేసేటప్పుడు శుచిగా ఉండాలి.
ఛఠ్ పూజ సమయంలో తామసిక ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఛఠ్ నాలుగు రోజులు ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం తీసుకోరాదు. ఇంట్లో ఇతర సభ్యులు కూడా ఈ నియమాలను అనుసరించేలా చూడాలి
ఛఠ్ పూజ సమయంలో ప్రసాదం తయారు చేయడానికి మాంసాహారం వండిన పాత్రలను ఉపయోగించకూడదు. అంతేకాకుండా, ఛఠ్ పూజలో గాజు పాత్రలను ఉపయోగించకూడదు.
వ్రతం ఆచరించే స్త్రీలు..పూర్తిగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి..ఉల్లి, వెల్లుల్లి కూడా ఉండకూడదు
వ్రతం చేస్తున్న మహిళలు ఛత్ పండుగ సమయంలో 4 రోజుల పాటు నేలపైనే నిద్రించాలి.
ఈ సంవత్సరం ఛఠ్ ప్రారంభం నహాయే ఖాయే అక్టోబర్ 25, ఖర్నా అక్టోబర్ 26, సంధ్యా అర్ఘ్యం అక్టోబర్ 27 ... ఉషా అర్ఘ్యం అక్టోబర్ 28, 2025 న వచ్చింది