Bathukamma 2022: తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ ఏడాది సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ జరిగే బతుకమ్మ వేడుకల్లో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ 'బతుకమ్మ'. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూల కాడలను చేతులతో తుంచి పెడతారు. కత్తితో కట్ చేసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు.
అప్పట్లో కొందరు మహిళలు నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వల్ల అప్పటి నుంచి అమావాస్య రోజు ఆడే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతారు.
మొదటి రోజు బతుకమ్మ పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకొస్తారని.. ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు ఇంకొందరు చెబుతారు.
కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందంటారు. మొదటి రోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి