నూతన సంవత్సరం మొదటి రోజు మహిళలు తప్పక చేయాల్సిన 3 పనులు! ఏడాదంతా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది
2026వ సంవత్సరం మొదటి రోజున మహిళలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటితో స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
సంవత్సరం మొదటి రోజు తులసికి నీరు సమర్పించండి, దానిలో ఎరుపు రంగు దారం కట్టండి. సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించి విష్ణువు మంత్రాలను జపించండి. ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో ధనానికి లోటు ఉండదని నమ్మకం.
నూతన సంవత్సరం ప్రారంభం దేవుళ్ళను పూజించిన తరువాత పెద్దల ఆశీర్వాదం తీసుకుని చేయండి. ఇంట్లో పెద్దలందరి కాళ్ళు మొక్కి ఈ సంవత్సరం వారికి ఏ లోటు రాకుండా చూస్తానని ప్రతిజ్ఞ చేయండి. పెద్దలు సంతోషంగా ఉన్న చోట శుభం ఉంటుంది.
2026 మొదటి రోజు ఇష్టదైవాన్ని ప్రార్థించండి..శివుడికి నీటితో అభిషేకం చేయండి. ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించండి
సంవత్సరం మొదటి రోజు ఏదైనా స్వీట్ తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. అనంతరం అందరికీ పంచిపెట్టండి
మహిళలు సంవత్సరం మొదటి రోజు ఆవుకు రొట్టె తినిపించాలి. అవసరమైన వారికి ధాన్యం, ధనం, దుప్పటి లేదా అవసరమైన వస్తువులను దానం చేయాలి.