Ashadha Purnima 2025 : ఆషాఢ పూర్ణిమ ఈ రోజే.. సాయంత్రం సమయంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే!
ఆషాఢ పూర్ణిమ రోజున స్నానమాచరించేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రాన్ని జపించండి. దీనివల్ల శరీరం, ఆత్మ కూడా శుద్ధి అవుతాయని నమ్మకం.
పూర్ణిమ రోజున సత్యనారాయణ పూజ చేసుకోవడం మంచిది..లేదంటే ఓం శ్రీ సత్యనారాయణాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీని ప్రభావంతో సుఖసంతోషాలు వస్తాయని చెబుతారు.
ఆషాఢ పూర్ణిమ రోజు గురు పూర్ణిమ..ఈ రోజు గురువులను పూజించేటప్పుడు ఓం గురుభ్యో నమః మంత్రాన్ని జపించాలి. గురువుల ఆశీస్సులతో జీవితం విజయవంతమవుతుంది.
ఆషాఢ పూర్ణిమ రోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించిన తరువాత - ఓం శ్రీ తులస్యై నమః మంత్రం జపించండి . దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్మకం.
ఆషాఢ పూర్ణిమ రాత్రి చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రమసే నమః మంత్రం జపించండి. దీనివల్ల మానసిక శాంతి, ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.
పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం మంత్రాన్ని జపించాలి. ఈ ప్రభావంతో దారిద్ర్యం తొలగిపోతుంది.