In Pics: తల్లడిల్లిన తండ్రి హృదయం.. బిడ్డను కాపాడుకునేందుకు తానే శాస్త్రవేత్తగా!
అరుదైన వ్యాధితో బాధపడుతోన్న తన రెండేళ్ల బాబును కాపాడేందుకు ఓ తండ్రి పడిన కష్టం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. (Photo Courtesy: AFP)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచైనా కన్‌మింగ్ ప్రాంతానికి చెందిన గ్జువీకి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడు అరుదైన మెంకెస్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన వ్యాధి బారినపడ్డాడు. (Photo Courtesy: AFP)
ఈ వ్యాధి వచ్చిన వాళ్లు మూడేళ్ల కంటే ఎక్కువ బతకడం కష్టం. కానీ లక్షణాలు ముదరకుండా ఉండేందుకు మందులు వాడొచ్చు. అయితే ఇవి చైనా లభించకపోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. (Photo Courtesy: AFP)
పోనీ విదేశాలకు వెళ్దామంటే కరోనా ఆంక్షలు అడ్డొచ్చాయి. దీంతో తాను ఉండే ప్రాంతంలోనే ఓ ల్యాబ్ ఏర్పాటు చేశాడు గ్జువీ. (Photo Courtesy: AFP)
ఆన్‌లైన్‌లో ఈ వ్యాధి గురించి, చికిత్స గురించి తెలుసుకుని తానే స్వయంగా ముందులు కనిపెట్టాడు. ముందు ఎలుకలపై తర్వాత తనపై ప్రయోగించుకుని ఏం కాలేదని నిర్ధరించుకున్న తర్వాత తన బిడ్డకు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మందు వల్ల తన బిడ్డ క్షేమంగా ఉన్నాడని ఆ తండ్రి హృదయం ఆనందంతో నిండింది. (Photo Courtesy: AFP)