Kerala Flood Update: కేరళలో వరద బీభత్సం.. పొంగిపొర్లుతోన్న నదులు, వాగులు, వంకలు
ABP Desam | 17 Oct 2021 02:25 PM (IST)
1
కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 18 మంది వరకు మరణించారు.
2
రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలను చేపట్టేందుకు 11 టీంలను రంగంలోకి దించింది కేంద్రం.
3
సైన్యం కూడా ఇందులో భాగమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని రక్షించేందుకు.. హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
4
కొట్టాయం జిల్లా కూట్టిక్కల్లో భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి.
5
ఎర్నాకుళంలోనూ వర్షాలకు మువత్తుపుళా నదిలోకి నీరు భారీగా వచ్చి చేరింది
6
ఆదివారం కూడా రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు పేర్కొంది
7
వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు కేంద్రం అండగా ఉంటుందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
8
కేరళ వద్ద ఆగ్నేయ అరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.