Co Pilot Role : విమానం నడిపేది కెప్టెన్ అయితే కో-పైలట్ ఏమి చేస్తాడు? కచ్చితంగా అతను ఉండాలా?
విమానం ఎగరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పైలెట్, కో-పైలెట్ ఇద్దరూ ఉంటారు. వీరు ఇద్దరూ కూడా విమానం నడపడంలో పూర్తిగా శిక్షణ పొందిన వారే ఉంటారు.
ఈ ఇద్దరు పైలట్లకు ఎలాంటి పరిస్థితులల్లోనైనా విమానం నడిపే అనుభవం ఉంటుంది. అయితే వీరిద్దరికీ అనుభవంలో చాలా తేడా ఉంటుంది. పైలట్ తన కో-పైలట్ కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉంటాడు.
విమాన ప్రయాణంలో కెప్టెన్‌కు ఏదైనా సహాయం చేయడానికి కో-పైలట్ ఉంటారు. కో-పైలట్లు ప్రయాణికులకు అదనపు భద్రతను ఇవ్వడంలో హెల్ప్ చేస్తారు.
కో-పైలట్ విమానం నడుస్తున్నప్పుడు ఇతర విషయాలను కూడా పర్యవేక్షిస్తారు. విమానంలో అంతా సరిగ్గా ఉందో లేదో వారు చెక్ చేస్తూ ఉంటారు.
కో-పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మానిటర్ చేయడంతో పాటు.. నావిగేషన్ బాధ్యతను కూడా నిర్వహిస్తారు. విమానంలో కో-పైలట్ ఉండటం వల్లే.. సురక్షితమైన గమ్యస్థానానికి చేరే వీలు ఉంటుంది.
ఒకవేళ విమాన ప్రయాణంలో పైలట్‌కు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే.. అప్పుడు మొత్తం బాధ్యతను కో-పైలట్ తీసుకుంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతారు.
విమానంలో కో-పైలట్ వాతావరణ సమాచారం, మార్గం గురించిన సమాచారాన్ని తీసుకుంటాడు. అలాగే ఇంధనం స్థాయి, బరువు, బ్యాలెన్స్‌ను కూడా పరిశీలిస్తాడు.