PM Modi US Visit: క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, బైడెన్, స్కాట్ మోరిసన్, యోషిహిడె సుగా
అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ. (Photo Credit/Modi Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్వేతసౌధంలో నిర్వహించిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ. (Photo Credit/Modi Twitter)
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా (Photo Credit/Modi Twitter)
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో కొవిడ్, పర్యావరణమార్పులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు సహా పలు అంశాలపై వారు చర్చించారు. (Photo Credit/Modi Twitter)
క్వాడ్ రూపొందించిన టీకా కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.(Photo Credit/Modi Twitter)
కొవిడ్, పర్యావరణ మార్పుల వంటి ఉమ్మడి సవాళ్లను అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయని బైడెన్ అన్నారు.(Photo Credit/Modi Twitter)
అంతకుముందు మోదీ... అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు.(Photo Credit/Modi Twitter)
భారత, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించుకున్నారు. (Photo Credit/Modi Twitter)
ఈ సందర్భంగా వారణాసి చేతివృత్తుల కళాకారుల నైపుణ్యాన్ని చాటే ‘గులాబి మీనాకారి చెస్ బోర్డునూ మోదీ... కమలా హారిస్‌కి బహూకరించారు. (Photo Credit/Modi Twitter)