Amarnath yatra 2025 : అమర్నాథ్ యాత్ర మార్గంలో విమానాలు, డ్రోన్ల నిషేధం ... దేశంలో ఎక్కడెక్కడ నో-ఫ్లయింగ్ జోన్ ఉంది? ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
పహల్గాం దాడి తరువాత జరుగుతున్న ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ మార్గంలో నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొత్తం మార్గాన్ని నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించింది. అయితే నో ఫ్లైయింగ్ జోన్ ఇది మొదటిసారి కాదు. దేశంలో మరెక్కడెక్కడ నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించారో తెలుసుకుందాం.
కొన్ని చారిత్రక మరియు ముఖ్యమైన భవనాలను ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించింది, ఇక్కడ డ్రోన్లను ఎగరడానికి ఎటువంటి అనుమతి లేదు.
దేశంలో రాష్ట్రపతి భవన్, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వేంకటేశ్వర దేవాలయం, పార్లమెంట్ భవన్, తాజ్ మహల్, స్వర్ణ దేవాలయం, ప్రధానమంత్రి నివాసం నో ఫ్లయింగ్ జోన్ ...
భారత వైమానిక దళ కేంద్రం, అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై, మథుర రిఫైనరీ, శ్రీహరికోట స్పేస్ స్టేషన్, పద్మనాభస్వామి ఆలయం, ది టవర్ ఆఫ్ సైలెన్స్ లను కూడా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు.
ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘించినప్పుడు మొదట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదా మిలిటరీ రాడార్ ద్వారా సంప్రదిస్తారు.
ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలనే హెచ్చరికలు జారీ చేస్తారు. అప్పటికీ పాటించకపోతే, భద్రతా లోపం కింద ల్యాండింగ్ చేయడానికి లేదా ఇంకా పరిస్థితి అదుపుతప్పుతందని భావిస్తే కాల్చివేయడానికి ఆదేశిస్తారు.