Air India Crash : మంటల్లోంచి ఎలా బయటపడ్డానంటే - మోదీకి చెప్పిన మృత్యుంజయుడు!
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ రమేష్ కుమార్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించారు ప్రధాని మోదీ
మొత్తం విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయినా తాను ఎలా బయటపడ్డానో మోదీకి వివరించారు విశ్వాస్.
విమానం కూలిన వెంటనే అందరూ దూకేయాలని ప్రయత్నించారు కానీ నేను ఆ ప్రయత్నం చేయలేదు. పైగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నా సీటు ఏకంగా విరిగిపోయి దూరంగా ఎగిరి పడింది. అందుకే మంటలు అంటుకోలేదు...
సీట్ ఎప్పుడైతే దూరంగా ఎగిరిపడిందో వెంటనే లేచి పరిగెత్తా..సెకెన్లలోనే మంటలు చెలరేగి అంతా ఆహుతైపోయారు..నేను ప్రాణాలతో బయటపడ్డాను అనివివరించారు విశ్వాస్.
అంతా తన కళ్లముందే జరిగింది ఎలా బతికానో కూడా అర్థంకాలేదని చెప్పారు విశ్వాస్. విమానం కిందపడగానే నేను కూడా చనిపోయాను అనుకున్నా కానీ.. హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానను...నెమ్మదిగా లేచి నడుచుకుంటూ వచ్చానని చెప్పారు. ఎడమచేతికి గాయం అయిందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు
బ్రిటన్‌లో ఉంటున్న విశ్వాస్ గుజరాత్ లో ఉన్న తన కుటుంబానని కలిసేందుకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది
ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ